అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లిటిల్ రాన్ నగరంలో అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. విమాన ప్రమాదంలో ఐదుగురు మరణించారు. లిటిల్ రాక్ ఫ్యాక్టరీ సమీపంలో విమానం కూలిపోయినట్లు స్థానికులు పోలీసులు వెల్లడించారు. బిల్ ,హిల్లరీ క్లింటన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు దక్షిణంగా కొన్ని మైళ్ల దూరంలో ఉన్న లిటిల్ రాక్‌లోని ఫ్యాక్టరీ సమీపంలో ఈ జంట ఇంజిన్‌లతో కూడిన విమానం కూలిపోయిందని పులాస్కి కౌంటీ షెరీఫ్ కార్యాలయ ప్రతినిధి లెఫ్టినెంట్ కోడి బుర్కే తెలిపారు. విమానంలో ఐదుగురు ఉన్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
No survivors in small plane crash near airport in Arkansas https://t.co/xcYHnkbSFl
— Daily Mail US (@DailyMail) February 22, 2023
BE20 లిటిల్ రాక్ విమానాశ్రయం నుండి, ఒహియోలోని కొలంబస్‌లోని జాన్ గ్లెన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిందని FAA తెలిపింది. అయితే విమానంలో ఉన్న వ్యక్తుల పేర్లను మాత్రం వెల్లడించలేదు. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్‌తో కలిసి ప్రమాదంపై దర్యాప్తు చేస్తామని FAA తెలిపింది. కాగాఅమెరికాలో మంచు తుఫాను కారణంగా, చాలా విమానాలు రద్దు అయ్యాయి. ప్రతికూల వాతావరణం వల్లే ఈ విమాన ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విమానం కూలిన తర్వాత భారీ మంటలు చెలరేగాయని క్రాష్ సైట్ చుట్టుపక్కల ప్రజలు తెలిపారు.