వీడియో : చైనాలో విమాన ప్రమాదం.. కావాలని కూల్చిన పైలెట్లు - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : చైనాలో విమాన ప్రమాదం.. కావాలని కూల్చిన పైలెట్లు

May 18, 2022

గత మార్చిలో చైనాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 132 మంది మరణించిన విషయం తెలిసిందే. గత 28 ఏళ్లలో ఆ దేశంలో జరిగిన పెద్ద విమాన ప్రమాదం ఇదే. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందని అప్పుడు అంతా అనుకున్నారు. కానీ, విమానంలోని బ్లాక్ బాక్స్‌ను విశ్లేషించిన అమెరికా.. పైలెట్లను కాక్‌పిట్‌లో ఎవరో ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కిందకు డైవ్ చేయమని బలవంతం చేసినట్టు తెలిపింది. విమానం వేగంగా భూమివైపు దూసుకొస్తున్న తరుణంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, సమీపంలోని విమానాల నుంచి ఎన్నిసార్లు కాల్ చేసినా పైలెట్లు స్పందించలేదని అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పేశారు. కాగా, పైలెట్, కో పైలెట్ ఇద్దరికీ ఎలాంటి ఆర్ధిక, కుటుంబ సమస్యలు లేవని చైనా ఎయిర్ లైన్స్ పేర్కొంది. ఇదిలా ఉండగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వచ్చే అవకాశాలున్నాయి. కాగా, విమాన సిబ్బంది సహా 132 మందితో బోయింగ్ 737 విమానం గంటకు 700 మైళ్ల వేగంతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.