ఆ వీడియో పోస్ట్ చేస్తే విమానాన్ని కూల్చేస్తా.. పైలెట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆ వీడియో పోస్ట్ చేస్తే విమానాన్ని కూల్చేస్తా.. పైలెట్

February 19, 2018

కొందరు పైలెట్లు విచక్షణ కోల్పోతున్నారు. కాక్ పిట్లో గొడవలు, బాత్రూంలలో అత్యాచారాలు.. నానా ఘాతుకాలకు తెగబడుతున్నారు. గోఎయిర్ విమాన పైలట్ ఒకరు తనను ప్రశ్నించినందుకు ఏకంగా విమానాన్నే కూల్చేస్తానని భయాందోళతనకు గురి చేశాడు. ఈ ఉదంతం నిన్న ఢిల్లీ ఎయిర్ పోర్టులో చేటుచేసుకుంది.బెంగళూరు వెళ్లాల్సిన విమానం టేకాఫ్ ఆలస్యమైంది. ప్రయాణికులు గంటన్నపాటు వేచి చూశారు. అయినా ఫలితం లేకపోయింది. తర్వాత పైలెట్లు నింపాదిగా ఏరోబ్రిడ్జిపై వస్తూ కనిపించారు. ఆ దృశ్యాలను  ప్రయాణికులు వీడియో తీశారు. దీనిపై పైలెట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రయాణికులు కూడా వెనక్కి తగ్గలేదు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. తర్వాత ఓ పైలెట్ ప్రయాణికుడిని తన వద్దకు పిలిపించుకున్నాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడితే విమానాన్ని గాలిలోనే కూల్చేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని సదరు ప్రయాణికుడు ఇతర ప్రయాణికులతో చెప్పేశాడు. దీంతో వారు భయాందోళనకు గురయ్యారు. పైలట్లను మార్చాలని కోరారు. యాజమాన్యం అందుకు ససేమిరా అంది. తర్వాత పైలెట్లు క్షమాపణ చెప్పారు. అయితే ముగ్గురు ప్రయాణికులు.. ఎందుకొచ్చిన గొడవ అంటూ విమానం దిగివెళ్లిపోయారు. తర్వాత యాజమాన్యం దృష్టికి సమస్య రావడంతో విమానం బయల్దేరింది. పైలట్ అలా బెదిరించలేదని గోఎయిర్ చెప్పింది. అయితే ముగ్గురు ప్రయాణికులు ఎందుకు దిగిపోయారు సరైన కారణం వెల్లడించలేదు.