Plane crashes in lake in Tanzania
mictv telugu

సరస్సులో కూలిన ప్రయాణికుల విమానం.. వీడియో ఇదిగో

November 6, 2022

ఆఫ్రికా దేశమైన టాంజానియాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. 49 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రెసిషన్ సంస్థకు చెందిన ఓ విమానం విక్టోరియా సరస్సులో కూలిపోయింది. టాంజానియా ఆర్ధిక రాజధాని దార్ ఎస్ సలాం నుంచి బుకోబా నగరానికి ప్రయాణిస్తున్న విమానం.. ల్యాండింగ్‌కి కొద్ది సమయానికి ముందు వాతావరణం అనుకూలించకపోవడంతో సరస్సులో పడిపోయింది.

 

ఈ సరస్సు విమానాశ్రయానికి వంద మీటర్లు దూరంలో ఉండడం గమనార్హం. ఈ ప్రమాదంపై టాంజానియాలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ప్రెసిషన్ ఎయిర్ కూడా ధ్రువీకరించింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్పందించిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి 26 మందిని కాపాడారు. గల్లైంతైన వారిని స్థానిక మత్స్యకారుల సహాయంతో గాలిస్తున్నారు. అటు విమానం తోక భాగం తప్ప బాడీ మొత్తం నీటిలో మునిగిపోయింది. మృతుల సంఖ్య, వివరాలు ఇంకా తెలియరాలేదు.