లారీ ముందు నుంచి వెళ్లిన విమానం.. చూసి తీరాల్సిందే.. - MicTv.in - Telugu News
mictv telugu

లారీ ముందు నుంచి వెళ్లిన విమానం.. చూసి తీరాల్సిందే..

March 14, 2019

విమానాలు గాల్లో, కార్లు రోడ్లపై, పడవలు నీటిలో వెళ్తాయి. కానీ కొన్నిసార్లు ఉల్టా పల్టా జరుగుతుంటుంది. నింగిలో వెళ్లాల్సిన విమానం ఒకటి రోడ్డుపై దూసుకెళ్లింది. అది కూడా ఓ లారీ ముందు నుంచి అడ్డంగా రివ్వున వెళ్లిపోయి ప్రమాదానికి గురైంది. గుండెలు అదిరే ఈ సంఘటన కెనాడలోని అంటారియోలో జరిగింది.

మంగళవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. లారీ డ్యాష్ క్యామ్‌లో ఈ సీన్ రికార్డయింది. సిరస్ ఎస్ఆర్20 విమానాన్ని ఓ లేడీ పైలట్ నడిపింది. అందులో ఒక ప్రయాణికుడు మాత్రమే ఉన్నాడు. విమానం హైవేపై అదుపు తప్పింది. రోడ్డుపై వెళ్తున్న ఎవరికీ గాయాలు కాలేదు. విమానంలోని పైలట్, ప్రయాణికుడు స్వల్పంగా గాయపడ్డారు. వీడియో మీరూ చూడండి.