సముద్రంలో ల్యాండ్ అయిన విమానం… - MicTv.in - Telugu News
mictv telugu

సముద్రంలో ల్యాండ్ అయిన విమానం…

September 28, 2018

ఆకాశంలో ఎగిరే విమానం అకస్మాత్తుగా నీళ్ళలో పడింది. ఈ ప్రమాదం విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు జరిగింది. దీంతో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి సురక్షితులయ్యారు. ఈ ఘటన పసిఫిక్ సముద్రంలోని మైక్రోనేషియన్ దీవుల్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఎయిర్ నుగినికి చెందిన విమానం 36 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో వీనో ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరింది.Plane that landed in the ocean ... passengers safeవిమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవాల్సింది. అయితే అక్కడ ల్యాండ్ అవకుండా రన్‌వేకు 150 మీటర్ల దూరంలో ఉన్న ఓ నీటి సరస్సులో ల్యాండ్ అయ్యింది.

విమానం నీటిలోకి దిగగానే స్థానికులు బోట్ల సాయంతో సంఘటనా స్థలానికి చేరుకుని  విమానంలో చిక్కుకున్న 36 మంది ప్రయాణికులను ప్రాణాలతో రక్షించారు. సిబ్బందిని కూడా కాపాడారు. తర్వాత విమానం నెమ్మదిగా సముద్రపు నీటిలో మునిగిపోయింది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో వర్షం ఉందని, చాలా తక్కువ ఎత్తులో విమానం ప్రయాణిస్తోందని, కానీ రన్‌వే చివరి భాగాన్ని విమానం తాకడం వల్ల అది ఎగిరి సముద్రం నీటిలో పడిందని తెలుస్తోంది. పాపువా న్యూ గునియా దేశానికి చెందిన ఎయిర్ నుగిని ఈ ఘటన పట్ల విచారణకు ఆదేశించింది.