టాయిలెట్ కోసం వెనక్కి వచ్చిన విమానం! - MicTv.in - Telugu News
mictv telugu

టాయిలెట్ కోసం వెనక్కి వచ్చిన విమానం!

January 31, 2018

కొన్ని సంఘటనలు వినడానికి విచిత్రంగా అనిపిస్తాయి. ఒక విమానంలో టాయిలెట్ సమస్య తెలత్తడంతో అప్పటికే రెండు గంటలు ప్రయాణించిన ఆ విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఇందులో విశేషమేమంటే విమానంలో ఏకంగా 84 మంది పంబ్లర్లు కూడా ఉండడం. అయితే ఒక సాంకేతిక సమస్యతో పీచేముఢ్ అనక తప్పలేదు. ఈ చిత్రం నార్వేలో జరిగింది.

ఈ నెల 27న ఓస్లో ఎయిర్‌పోర్ట్ నుంచి డీవై1156 విమానం పొద్దున 9.34 గంటలకు జర్మనీలోని మ్యూనిక్ నగరానికి టేకాఫ్ తీసుకుంది. విమానం 10వేల ఎత్తులో ఎగురుతోంది.స్వీడన్‌ సరిహద్దుకు వచ్చింది. అయితే అప్పడే ఒకరు టాయిలెట్‌కు వెళ్లి, అది సరిగ్గా పనిచేయడం లేదని సిబ్బందికి చెప్పారు

సిబ్బంది విషయం తెలుసుకున్నారు. దారిమధ్యలో మరమ్మతు చేయడం సాధ్యం కాదని విమానాన్ని వెనక్కి మళ్లించి ఓస్లో ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న 84మంది ప్లంబర్లు మ్యూనిక్‌కు ప్లంబర్ పనులు చేసేందుకు వెళ్తున్నారు. వారితో మరమ్మతు చేయించాలని అనుకున్నామని, అయితే విమానం బయటివైపు నుంచి సమస్య ఉండడంతో 10 వేల అడుగుల ఎత్తులో మరమ్మతు సాధ్యం కాదని విమానాన్ని వెనక్కి తీసుకొచ్చామని అధికారులు చెప్పారు.