గాల్లో గుద్దుకున్న విమానాలు.. ముగ్గురి మ‌ృతి - MicTv.in - Telugu News
mictv telugu

గాల్లో గుద్దుకున్న విమానాలు.. ముగ్గురి మ‌ృతి

April 1, 2022

14

గాల్లో రెండు విమానాలు గుద్దుకున్న ఘటన దక్షిణ కొరియాలో జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. వాయుసేనకు చెందిన రెండు శిక్షణా విమానాలు గాల్లో ఢీకొని సచియాన్ నగరం సమీపంలోని పర్వతాలపై కూలిపోయాయి. ఈ విషయాన్ని అక్కడి అత్యవసర విభాగం ధృవీకరించింది. అయితే మృతుల సంఖ్యపై స్పష్టత రాలేదు. పైలెట్లలో ఎవరైనా ప్రాణాలతో బయటపడ్డారా? అనే కోణంలో గాలింపు చేపడుతున్నారు. గాలింపులో 30 విమానాలు, ఇతర సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 1.35 గంటలకు ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన కేటీ – 1 శిక్షణా విమానాలు ఢీకొన్నాయి. కాగా, జనవరిలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది.