అంతరిక్షం నుంచి గ్రహ శకలాలు భూమ్మీద పడడం ఈ మధ్య తరచుగా పడుతున్నాయి. వాటిని చూసి సమీప గ్రామ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. తాజాగా గుజరాత్లో పడిన శకలాలను చూసి గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వివరాలు.. సురేంద్రనగర్ జిల్లాలోని సాయిలా గ్రామంలో సోమవారం కొన్ని శకలాలు భూమ్మీద పడి ఉండడాన్ని గ్రామస్తులు గమనించారు.
వాటిని పరిశీలించి చూడగా, ఈకల రూపంలో తీగలుగా ఉండడంతో గ్రామస్తులు తొలుత ఆశ్చర్యపోయి తర్వాత పోలీసులకు సమాచారమందించారు. వారు కూడా వచ్చి చూసి ఖంగుతిని, గోళాలు ఆకాశం నుంచి ఊడిపడ్డాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో ఈ విషయాన్ని ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ నిపుణులకు సమాచారం ఇచ్చారు. వీటిని పరిశీలించిన నిపుణులు.. భూమికి సమీపంలో తిరుగుతున్న శాటిలైట్ శకలాలు అయి ఉంటాయని ఓ అవగాహనకు వచ్చారు. కాగా, కొద్దిరోజుల క్రితం గుజరాత్‌లోనే ఐదు కిలోల గోళాలు ఆకాశం నుంచి ఊడిపడ్డాయి. ఒకవేళ అంతు ఎత్తు నుంచి వస్తున్న ఈ శకలాలు నెత్తిమీద పడితే ఏంటి పరిస్తితి అంటూ చర్చించుకుంటున్నారు.