పార్కులో వింత మంట...వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

పార్కులో వింత మంట…వీడియో వైరల్

May 10, 2020

planned park fire video goes viral

కొన్ని వీడియోలు అస్సలు నమ్మశక్యంగా ఉండవు. ఆ వీడియోలో చూపించింది.. నిజామా లేదా గ్రాఫిక్స్ అనే తేడా తెలియదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్పెయిన్‌లోని కలహొర్రాలోని పార్క్ వీడియో ఇందుకు చక్కటి ఉదాహరణ. 

Cuidado con las pelusas.

Publiée par Club De Montaña Calahorra sur Mercredi 6 mai 2020

అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలు ఇష్టమొచ్చినట్లు వీస్తాయి. కానీ, కలహొర్రాలోని పార్కులో మంట సముద్రంలో అల వచ్చినట్లుగా వెళ్తూ… ఎండిన గడ్డి మొక్కల్ని మాత్రమే తగలబెట్టింది. మధ్యలో ఉన్న చెక్క బెంచీలను ఏం చేయలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంటలు అలలాగా ముందుకు సాగడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మంటకు వెనక వైపు నుంచి బలమైన గాలి వీయడం వల్ల ఇలా జరిగిఉంటుందని అంచనా భావిస్తున్నారు.