ప్లాస్టిక్ కిరీటం ధర రూ. 43 లక్షలు  - MicTv.in - Telugu News
mictv telugu

ప్లాస్టిక్ కిరీటం ధర రూ. 43 లక్షలు 

October 22, 2020

Plastic crown worn by The Notorious B.I.G. sold for record-breaking amount

ప్లాస్టిక్ వస్తువుల ధరలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. రకాన్ని బట్టి రూపాయి నుంచి వెయ్యి, ఐదు వేల రూపాయల వరకు పలుకుతాయి. కానీ ఓ జానాబెత్తెడు ప్లాస్టిక్ కిరీటం ఏకంగా 45 లక్షల రూపాయలు పలికింది. దాన్ని వేల వేసిన సంస్థ అంచనాలు కూడా బద్దలు కొట్టేసింది. 

మరి అంత ధర పలికిందంటే మామూలు కిరీటం కాదని అర్థమై ఉంటుంది. అవును, దానికో పెద్ద చరిత్ర ఉంది. అది అమెరికన్ ర్యాప్ గాయకుడు క్రిస్టఫర్ వాలెస్ ధరించిన మకుటం. అందుకే దానికంత డిమాండ్. 1972లో జన్మించిన వాలెస్.. ‘ద నొటోరియస్ బిగ్ బిగీ స్మాల్స్’ అనే మ్యూజిక్ బ్యాండులో పాటలు పాడేవాడు. నల్లజాతీయుడైన అతనికి అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 1997లో చనిపోయిన వాలెస్ వస్తువులు తర్వాత వేలానికి వచ్చాయి. కోట్లు, బూట్లు వంటి వాటిని అభిమానులు కొన్నాడు. ఈ ప్లాస్టిక్ కిరీటాన్ని ఎవరు కొంటార్లే అని అప్పట్లో వదిలేశారు. తర్వాత అది కూడా విలువైందేనని వేలం వేశారు. సోత్‌బీ సంస్థ దీన్ని వేలం వేయగా గుర్తుతెలియని వ్యక్తి అక్షరాలా 43 లక్షలు ధారపోసి పట్టుకెళ్లాడు. 

ఒక ప్లాస్టిక్ వస్తువుకు ఇంత ధర పలకడం ప్రపంచంలో ఇదే తొలిసారి. జాన్ కెన్నడీ, మార్లిన్ మన్రో, మైకేల్ జాక్సన్ వంటి వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీలు వాడిన ప్లాస్టిక్ వస్తువులకు కూడ ఇంత ధర పలకలేదట. అభిమాన నటీనటులు, గాయకులు, రాజకీయ నాయకులు వాడిపారేసిన వస్తువుల కోసం ఇటీవల కాలంలో విపరీతంగా డిమాండ్ పెరిగిది. అమెరికా దివంగత అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌కు చెందిన కాసిన్ని వెంట్రుకలు 60 లక్షలకు ఇటీవలే అమ్ముడుబోయాయి. మన జాతిపిత గాంధీ వాడిన కళ్లజోడు కూడా ఏకంగా రెండున్నర కోట్లకు అమ్ముడుబోయింది. 

https://www.instagram.com/p/CFLe84aghp1/?utm_source=ig_embed