ప్లాస్టిక్ బియ్యం..ప్లాస్టిక్ గుడ్లు..ఏం తిని బతకాలిరా నాయనో..! - MicTv.in - Telugu News
mictv telugu

ప్లాస్టిక్ బియ్యం..ప్లాస్టిక్ గుడ్లు..ఏం తిని బతకాలిరా నాయనో..!

June 3, 2017

ప్లాస్టిక్ గుడ్లు..ప్లాస్టిక్ బియ్యం..కల్తీ పాలు..కల్తీ నెయ్యి..కల్తీ అల్లం వెల్లులి పేస్ట్..ఇలా అన్నింటిని కల్తీ చేస్తున్నారు. ఏం తిందామన్నా..ఏం కొందామన్నా.. కల్తీ కాటు భయపెడుతోంది. ఆకలి తీర్చే అన్నం..తాగే నీళ్లు…సర్వం కల్తీ మాయం. ధమ్ బిర్యాన్నిల్లోనూ కల్తీ వాడేస్తున్నారంటే అవి ఏ స్థాయికి వెళ్లిదంటే…ప్రశ్నించి వారిపై దాడుల చేసేదాకా..ఈ కల్తీ కేటుగాళ్ల గురించి ఎంత తక్కువ చెబితే అంతా మంచిదే. ఇలాంటోళ్లకు పీడీ కేసులు తగిలిస్తే గానీ దారికి రారు. వీళ్ల గురించి మాట్లాడం వదిలేసి.. కల్తీ వస్తువుల్ని ఎలా గుర్తుపట్టాలో చూడాలి.

ఇలా ప్లాస్టిక్ కోడిగుడ్లను గుర్తించండి

మామూలు గుడ్లలగే ఉంటాయి. వాటిని పగులకొట్టడం చాలా కష్టం
ఉడికిన తర్వాత గట్టిగా ఉంటాయి. రబ్బరు బంతిలా తయారవుతాయి.
కాలిస్తే ప్లాస్టిక్ లానే కాలిపోతాయి. రుచిలో కూడా తేడా ఉంటుంది.

ఇక ఇలా ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించండి

మామూలు బియ్యం కంటే తెల్లగా, బరువు తేలికగా ఉంటాయి.
ప్లాస్టిక్ బియ్యం నీటిలో తేలుతాయి.అసలు బియ్యం అయితే నీటిలో మునుగుతాయి. పైకి తేలిన గింజలు ఉంటే అందులో ప్లాస్టిక్ బియ్యం కలిసినట్లు గుర్తించాలి.
బియ్యాన్ని ఉడికించేటపుడు పాత్రల అంచుల్లో చిక్కని లేదా మందమైన పొర ఏర్పడుతుంది.
అగ్గిపుల్లతో అంటించినపుడు ప్లాస్టిక్ కాలిన వాసన వస్తుంది
వండిన అన్నం కొంత గిన్నెలో ఉంచండి. ఆ అన్నం పాచిపోతే మంచి బియ్యం, లేకపోతే ప్లాస్టిక్ బియ్యం
ఇలా ప్లాస్టిక్ గుడ్లు..ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించి..ఆరోగ్యాల్ని కాపాడుకోండి..