అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్లేబాయ్ పోటీ - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్లేబాయ్ పోటీ

November 14, 2019

ఎప్పుడూ అందమైన అమ్మాయిలతో పార్టీ చేసుకోవడమే కాకుండా ‘ఇన్‌స్టాగ్రామ్‌’ కింగ్‌గా గుర్తింపు పొందిన డేన్‌ బిల్జేరియన్‌ 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. ఇతడికి ప్లేబాయ్ అనే నిక్ నేమ్ కూడా ఉంది. ఇటీవల ఓ విదేశీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా?’ అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, కచ్చితంగా అని చెప్పలేనుగానీ, ఇంకా చాలా సమయం ఉన్నందున అప్పటికీ అన్నివిధాల సిద్ధం కావచ్చని భావిస్తున్నానని తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని టంపాలో జన్మించిన బిల్జేరియన్‌కు 38 ఏళ్లు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు 2.9 కోట్ల మంది అభిమానులున్నారు.

బిల్జేరియన్‌ పుట్టుకతోనే ధనవంతుడైనప్పటికీ ‘పోకర్‌ స్టార్‌’గాను, పలు వ్యాపారాల ద్వారా వందల కోట్లు సంపాదించారు. ‘లోన్‌ సర్వైవర్‌’ అనే హాలీవుడ్‌ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటిలాగే ఖర్చు పెట్టినా రెండు, మూడు జన్మల వరకు ఆయన సంపద తరగదు. డబ్బే కాకుండా మంచి శరీర సౌష్టవంతో ఆకర్షణీయంగా ఉండడం ఆయన వెంట అమ్మాయిలు పడడానికి మరో కారణం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బిల్జేరియన్‌‌కు మద్దతిస్తానని కన్యే వేస్ట్‌ తెలిపారు. కన్యే వేస్ట్‌ ప్రముఖ అమెరికా పాప్‌ సింగరే కాకుండా అమెరికా ప్రముఖ మోడల్, టీవీ ప్రెజంటర్, వ్యాపారవేత్త కిమ్‌ కర్దాషియిని భర్త.