ఎద్దుతో చెలగాటం ఆడాడు.. చివరికి - MicTv.in - Telugu News
mictv telugu

ఎద్దుతో చెలగాటం ఆడాడు.. చివరికి

April 5, 2022

 

సోషల్ మీడియాలో యువతి, యువకులు పలు రకాల వీడియోలు చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. తమ టాలెంట్ ఏంటో ఈ సమాజానికి తెలియజేయాలని మనసుకు తోచిన విధంగా వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది ఫేమస్ అవ్వటం కోసం ప్రయత్నిస్తుంటే, మరికొంతమంది ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ యువకుడు ఎద్దుతో ఏం చేయాలని అనుకున్నాడో తెలియదు కానీ, చివరికి కోపంతో రెచ్చిపోయిన ఎద్దు తన రెండు కొమ్ములతో ఆ యువకుడిని మూడుసార్లు లేపి లేపి ఎత్తేసిన సంఘటన సంచలనంగా మారింది.

 

వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు అందరూ చూస్తుండగానే వీధిలో ఉన్న ఓ ఎద్దును రెచ్చగొట్టాడు. అయినా, ఆ ఎద్దు తన మానాన తాను అలా నిలబడి ఉంది. అయితే, కేరింతలు కొడుతూ దాని దగ్గరకు వెళ్లి రెచ్చగొట్టాడు. దీంతో కోపంతో రెచ్చిపోయిన ఎద్దు.. ఆ యువకుడితో ఓ ఆట ఆడుకుంది. కాలితో రంకె వేసినట్లు చిన్న సిగ్నల్ ఇచ్చి.. ఒకేసారి యువకుడిపై దాడి చేసింది. మూడుసార్లు తన కొమ్ములతో లేపి లేపి ఎత్తేసింది. ఇదంతా చూస్తున్న అతని ఫ్రెండ్స్ గోడ వెనక నుంచి వీడియోలు తీశారు.

ఇక, చివరిగా దాడిచేసిన ఎద్దు అక్కడి నుంచి పారిపోయింది. దీంతో స్నేహితులు ఆ యువకుడి వద్దకు పరుగెత్తుకొనిపోయి, ఆస్పత్రికి తరలించారు. వీడియోను వీక్షిస్తున్న వారంతా ఇదేం ఆట రా బాబు.. సరదా తీరిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ట్విట్టర్‌లో @TheFigenఅకౌంట్‌లో ఏప్రిల్ 3,2022న పోస్ట్ చేసిన ఈ వీడియోని ఇప్పటికే 2.68 లక్షల మందికి పైగా చూశారు. 10 వేల మందికి పైగా లైక్ చేశారు. చాలా మంది నెటిజన్లు ఆ యువకుడి చేసిన అల్లరి పనిని తప్పుపడుతున్నారు.