ఐపీఎల్ రూల్స్ ఇవే.. నాలుగుసార్ల టెస్టులట! - MicTv.in - Telugu News
mictv telugu

ఐపీఎల్ రూల్స్ ఇవే.. నాలుగుసార్ల టెస్టులట!

July 31, 2020

Players to undergo four COVID-19 tests before IPL 2020

కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది మార్చి-మే మాసాల్లో జరగాల్సిన ఐపీఎల్ సీజన్ ఆలస్యం అయినా సంగతి తెల్సిందే. మార్చి 29న జరగాల్సిన ఈ మెగా టోర్నీ వాయిదా పడింది. తాజాగా సెప్టెంబర్ మాసం నుంచి దుబాయ్ వేదికగా ఐపీఎల్ జరుగనుందని సమాచారం. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ మొత్తం 51 రోజులు ఈ సీజన్ ఐపీఎల్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే దుబాయ్ లో ఈ టోర్నీ నిర్వహించడానికి అక్కడి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు కొన్ని నియమాలను విధించింది. 

ఐపీఎల్ లో పాల్గొనే ఆటగాళ్లు లీగ్ ప్రారంభానికంటే ఒక నెలముందే అక్కడికి వెళ్లనున్నారు. ఐపీఎల్ లో ఆడే క్రికెటర్లకు ఇక్కడి నుండి దుబాయ్ కి బయలుదేరే ముందు రెండు సార్లు అక్కడికి వెళ్లిన తర్వాత మరో రెండు సార్లు మొత్తం నాలుగు కరోనా సార్లు పరీక్షలు చేయనున్నారు. అందులో నెగెటివ్ వచ్చిన ఆటగాళ్లకు మాత్రమే అవకాశం కల్పించనున్నారు. అలాగే క్రికెటర్లు అందరూ 14 రోజులు క్వారంటైన్‌ లో తప్పకుండ ఉండాల్సిందే. ఆటగాళ్లతో ప్రయాణించే బస్ డ్రైవర్, హోటల్‌లో సిబ్బందికి కూడా ఈ నియమాలు వర్తిస్తాయని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.