అష్టాచెమ్మా.. తలలు పగలగొట్టుకున్న వైసీపీ, టీడీపీ వీరులు - MicTv.in - Telugu News
mictv telugu

అష్టాచెమ్మా.. తలలు పగలగొట్టుకున్న వైసీపీ, టీడీపీ వీరులు

August 3, 2020

Playing Ashta chemma .. YSRCP and TDP activists with broken heads.

అసలే రెండు పార్టీలకు పడదు. నువ్వు ‘తా’ అంటే నేను ‘తందానా’ అనుకుంటారు. అలాంటివారు ఏదైనా ఆట ఆడారంటే ఊరుకుంటారా.. వేట అనేయరు? వారి మధ్య గిలిగింతలు పెట్టే ఆట అయినా సీరియస్‌గా కొట్లాటకు దారితీసేయదూ? టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య అదే జరిగింది. చిలికి చిలికి గాలివాన అన్నట్టు పరస్ఫరం తలలు పగలగొట్టుకునే వరకు వెళ్లారు. రాళ్లు, కర్రలతో వారు గొడవపడి తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
ఈ ఘటన గుంటూరు జిల్లా, చిరుమామిళ్లలో చోటు చేసుకుంది. తొలుత ఆ రెండు వర్గాలు నడిరోడ్డుపై అష్టా చెమ్మా ఆటకు పూనుకున్నాయి. ఆ ఆటలో కాయలను చంపడం సహజమే. అది జీర్ణించుకోలేని వారు చిన్నగా గొడవ మొదలుపెట్టారు. అది కాస్తా పెరగడంతో రాళ్లు, కర్రలు పట్టుకుని వీర లెవల్లో విజృంభించుకుపోయారు. 

ఈ దాడిలో ఇరువర్గాల వారికి గాయాలు అయ్యాయి. ఘటనపై సమాచారం అందుకుప్ప పోలీసులు 20 మందిపై కేసు నమోదు చేశారు. ఇరువర్గాల మధ్య ఉన్న పాత గొడవలే ఈ దాడికి కారణం అని పోలీసులు భావిస్తున్నారు. రాజకీయ కక్ష్యలే ఈ గొడవకు ప్రధాన కారణం అని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.