సరదాగా ఆడితే వోకే.. పైసలు ఎంది సార్లూ..! - MicTv.in - Telugu News
mictv telugu

సరదాగా ఆడితే వోకే.. పైసలు ఎంది సార్లూ..!

July 3, 2017

వీకెండ్ వస్తే మస్తు మజా..సండేని సరదాగా గడిపేయాలి.కొందరు పార్క్ లు ,సినిమాలకు వెళ్తే మరికొందరు దోస్తులతో పార్టీలు చేసుకుంటారు. ఫ్రెండ్స్ కలిస్తే విందుతో పాటు కార్డు పడాల్సిందే. మూడు ముక్కలాట ఆడితేనే మజా. అదీ సరదాగా డబ్బులు పెట్టకుండా. అధికారులకు సండే వచ్చిందంటే ఎక్కడలేని జోష్. సరదా సరదా గా ఉండేయాలనుకుంటారు వోకే..ఆడితే పేకాట పైసలు పెట్టకుండా ఆడుకోండి. ముక్క వేస్తూ పెగ్గూ మీద పెగ్గూ కొడుతూ ఎంజాయ్ చేయండి మీ ఇళ్లల్లో ..మరే చెట్టుకిందో ఆడుకోండి గానీ ఆఫీసులో పేకాట ఏంటీ సార్లూ..పైగా పైసలు పెట్టి మరి…పదిమందికి చెప్పాల్సిన వాళ్లే పరువు తీస్కుంటే ఎలా..? సరదాగా ఆడాల్సింది పోయి పైసలు పెడుతూ కొలువు, కొంపకెందుకు ఎసరు తెచ్చుకుంటున్నారు.?

పండుగలు , సెలవులు వచ్చాయంటే చాలా ఊళ్లలో పేకాట ఆడుతూ ఉంటారు. ఇక ప్రతి ఆదివారం ముక్కల వారమే. కొందరు సరదాగా ఆడుతుంటే మరికొందరు పైసలు పెట్టి ఆడుతుంటారు. పైసలు పెట్టి ఆడేటోళ్లు మార్నింగ్ కూర్చుంటే ఈవెనింగ్ దాకా లేవరు. ఇంటోళ్లు వచ్చి పిలిస్తే కానీ ..వాళ్లకు ఇల్లు గుర్తుకురాదు. డబ్బులు పోయేవాడికి పోతాయ్..వచ్చేవాడికి వస్తాయ్. పెగ్గు వేస్తూ ఇంకొందరు పేకాట ఆడుతారు. కొందరు సంసారాన్ని రోడ్డున పడేస్తే మరికొందరు పైసా కమాయిస్తారు. ఇందులో మామూలోడి నుంచి మంచి మంచి అధికారులదాకా ఉంటారు. కాకపోతే ఎవరి బ్యాచ్ వారిది..ఎవరి లెవల్ వారిదే. ఏ ఊళ్లోనైనా..పట్టణంలోనైనా పేకాట దందా నడూస్తే ఉంది. పోలీసులూ చూసీచూడనట్లు వదిలేస్తుంటారు.

ఇలా పేకాట ఆడిన ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి ఆర్డీవో బ్యాచ్ అడ్డంగా బుక్కైంది. అదీ ఆఫీసులో ఆడుతూ పోలీసులకు చిక్కారు. ఏం సార్లూ ఆ ఆట ఆడేందుకు ఆఫీసే దొరికిందా…ఏ ఇల్లు కంపార్ట్ గా లేకపోయిందా…ఆడితే ఆడిన్రు గానీ పైగా పైసాలట ఎందో.. ఇది తప్పు అని తెలియదా..తెలిసినా పోలీసులను మేనేజ్ చేయొచ్చా అనుకున్నారా…? పేకాట ఆడుతూ దొరికిన వారిలో ఆర్డీవో ఏపూరి భాస్కర రావుతో పాటు ఆర్ ఐ కల్లూరి కిరణ్ కుమార్ , జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ , డీటీలు కృష్ణాప్రసాద్ , రాళ్లబండి రాంబాబులున్నారు.

ఇక ముందు పేకాట ఆడే ఆఫీసర్లకు ఇదో హెచ్చరిక. వీళ్లే కాదు ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఆట పిచ్చిలో మునిగితేలుతూ ఉంటారు. ఆడితే సరదాగా పైసలు లేకుండా ఆడుకోండి..ఇలా పరువు తీసే పనులు చేయొద్దు..