అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు

December 2, 2019

Ayodhya 02

దశాబ్దాలుగా కొనసాగిన అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు ధర్మాసనం తుది తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.  ఆ భూమిని రామమందిర నిర్మాణ కోసం హిందువులకు అప్పగించిన కోర్టు మసీదు నిర్మాణం కోసం మరో చోట ముస్లింలకు 5 ఎకరాలు కేటాయించాలని ఆదేశించింది. ఆ తీర్పుపై ఈ రోజు రివ్యూ పిటిషన్ దాఖలైంది. జమాతే ఉలేమా ఎ హింద్ అనే సంస్థ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. మౌలానా సయ్యద్ అషద్ రషీది అనే వ్యక్తి అయోధ్య భూవివాదంపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. 

అయితే ఆలిండియా ముస్లీం పర్సనల్ లా బోర్డు(ఎఐఎంపీఎల్‌బీ) మాత్రం అయోధ్య భూవివాదంపై ఇప్పట్లో రివ్యూ పిటిషన్ వేసే ఆలోచన లేదని తెలిపింది. ఈ అంశమై బోర్డు ప్రతినిధి జాఫర్‌యాబ్ జిలాని మాట్లాడుతూ ఈరోజు సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేయడం లేదన్నారు. డిసెంబర్ 9లోపు అయోధ్య తీర్పుపై ఎప్పుడైనా రివ్యూ పిటిషన్ వేసే అవకాశం ఉందన్నారు. సుప్రీం తీర్పుపై ఎఐఎంపీఎల్‌బీ బోర్డు సభ్యులు, బాబ్రీ మసీదు యాక్షన్‌ కమిటీ, ముస్లిం మత పెద్దలు, సంస్థలు గతంలో లక్నో సమావేశమై చర్చించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా హాజరయ్యారు. తీర్పును పరిశీలించిన సమావేశం.. తీర్పు తమకు ఆమోదయోగ్యం కాదని, రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించింది. దీనిపై న్యాయవాదులతో మాట్లాడతామని జమాతే ఉలేమా ఎ హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ మీడియాకు తెలిపారు. సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ ఈ పిటిషన్ వ్యహారం చూస్తారని, వచ్చే నెల  9వ తేదీ దాఖలు చేస్తామని చెప్పారు. షరియా ప్రకారం మసీదు భూమి అల్లాకు చెందుతుందని, దాన్ని మరొకరికి ఇవ్వడం కుదరదని అన్నారు.