Please don't touch foreigners..China post goes viral
mictv telugu

విదేశీయుల్ని తాకకండి..చైనా వార్నింగ్

September 19, 2022

చైనా ప్రభుత్వం అక్కడి దేశస్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. చైనా దేశంలో నివాసముంటున్న విదేశీయుల్ని ఎవ‌రూ తాక‌వ‌ద్దు అని ఆదేశాలు జారీ చేసింది. అందుకు గల కారణాన్ని కూడా చైనా ప్రభుత్వం తెలియజేసింది. ‘తాజాగా ప్రపంచ దేశాలను అతలకూతలం చేస్తున్న మంకీపాక్స్ కేసు ఒకటి చైనాలో వెలుగు చూసింది. కనుక ఆ వ్యాధి మరొకరికి సోకకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని చైనా అంటువ్యాధుల నివార‌ణ సంస్థ (సీడీసీ) చీఫ్ ఎపిడ‌మ‌యాల‌జిస్ట్ వూ జున్యూ త‌న వీబోలో రాసుకొచ్చారు.

అయితే, విదేశీయుల‌ను స్కిన్ టు స్కిన్ తాక‌వ‌ద్దు అని త‌న పోస్టులో ఆయ‌న తెలుపడంతో ప్రస్తుతం ఆ పోస్ట్ ప్రపంచదేశాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ పోస్టుపై పెద్ద వివాదమే చెల‌రేగింది. చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్రమైన ఆరోపణనలు వెల్లువెత్తుతున్నాయి. ”చైనా ప్రభుత్వం చేసిన ఆ పోస్ట్ జాత్యాహంకార‌ కామెంట్‌లా ఉంది. వూ జున్‌యు సూచనలు వివక్షాపూరితంగా ఉన్నాయి” అని చైనానీయులు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు.

ఈ క్రమంలో తాను చేసిన పోస్టుపై తీవ్రమైన విమర్శలు వస్తుండడంతో, పరిస్థితిని గమనించిన వూ జున్‌యు..తన వీబో ఫ్లాట్‌ఫామ్‌లో ఉన్న ఆ కామెంట్ల‌ను తొల‌గించి, కొద్దిసేపటికి ”ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న విధానం కొన‌సాగించేందుకు, మంకీపాక్స్ వ్యాధి సోక‌కుండా ఉండేందుకు, విదేశీయుల‌ను నేరుగా తాక‌రాదు. ఇటీవ‌ల విదేశాల‌కు వెళ్లి వ‌చ్చిన వారిని కూడా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కావొద్దు” అని ఆయ‌న ప్రజలను కోరారు.