దయచేసి నన్ను క్షమించండి: అక్షయ్ కూమార్ - MicTv.in - Telugu News
mictv telugu

దయచేసి నన్ను క్షమించండి: అక్షయ్ కూమార్

April 21, 2022

02

‘‘నన్ను క్షమించండి, అభిమానులకు, శ్రేయోభిలాషులకు క్షమాపణలు చెప్తున్నా. మీ ప్రతి స్పందన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇకపై పొగాకు ఉత్పత్తులకు ప్రచారం చేయబోను. విమల్ ఇలైచీతో నేను జట్టుకట్టడంపై మీరు వెల్లడించిన అభిప్రాయాలను గౌరవిస్తాను. విమల్ ఇలైచీ నుంచి నేను తప్పుకుంటున్నాను. ఇలాంటి విషయాల్లో ఇకపై మరింత అప్రమత్తంగా ఉంటాను’’ అని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కూమార్ తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు.

గతకొన్ని రోజుల క్రితం అక్షయ్ కుమార్ ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. ఇప్పుడు అదే అక్షయ్ కూమార్ పొగాకు బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఉండడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తీవ్ర విమర్శలు చేశారు. పొగాకు, ఆల్కహాల్‌కు వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రచార వీడియోలను కూడా షేర్ చేశారు. దీంతో అక్షయ్ కూమార్ వెనక్కి తగ్గి సారీ చెబుతూ తన నిర్ణయాన్ని ప్రకటించాడు.

మరోపక్క పాన్ మసాలా బ్రాండ్ ప్రకటనలో షారూఖ్ ఖాన్, అజయ్ దేవగణ్‌లు నటిస్తున్న విషయం తెలిసిందే. విమల్ ప్రపంచంలోకి కొత్తగా అక్షయ్ కుమార్‌ను స్వాగతించారు. దీంతో ఈ ముగ్గురు కలిసి సెల్యూట్ చేసి ఇలైచీ నమిలారు. దీంతో అగ్రహించిన అక్షయ్ కూమార్ అభిమానులు ఒక్కసారిగా తీవ్రమైన విమర్శలు చేశారు. వెంటనే అక్షయ్ కూమార్ క్షమాపణలు చెప్పారు.