దయచేసి మమ్మల్ని చంపేయండి: చైనా ప్రజలు - MicTv.in - Telugu News
mictv telugu

దయచేసి మమ్మల్ని చంపేయండి: చైనా ప్రజలు

April 11, 2022

nvnvmv

చైనా దేశం కరోనా మహమ్మారితో పోరాడుతుంది. ప్రజలకు తింటానికి తిండిలేక, ఇళ్లలో ఉండలేక నానా అవస్థలు పడుతున్నారు. దీంతో చైనా అధికారులు ఏం చేయాలో? ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో? తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు అపార్ట్‌మెంట్లనుంచి ప్రజలు కేకలు, అరుపులు వేస్తూ.. ఇంతటి కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేసే బదులు, దయచేసి మమ్మల్ని చంపేయండి అంటూ అధికారులను వేడుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చైనా దేశం విధించిన కఠినమైన లాక్‌డౌన్‌తో జనాలకు మెంటల్ ఎక్కిపోతోంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి దేశంలోని ఆర్థిక రాజధాని షాంఘై సహా 23 సిటీల్లో లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండడంతో షాంఘై ప్రజల గోస వర్ణనాతీతంగా మారింది. వారం రోజులుగా ఇంట్లోనే ఉంటుడడం, ఆహారం ఇతర అవసరాలకు కొరత ఏర్పడడంతో ప్రజలు తమ అపార్ట్‌మెంట్ల నుంచే అరుపులు, కేకలు వేస్తున్నారు.

 

”ఇంతటి లాక్‌డౌన్‌ను అమలు చేసే బదులు అందరినీ చంపేయండి” అని చైనా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆ వీడియోలను అమెరికాకు చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ ఎరిక్ ఫీల్డింగ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అపార్ట్‌మెంట్లలోని ప్రజలు ‘యావో మింగ్ లే’, ‘యావో షీ’ అంటూ స్థానిక షాంఘైనీస్ భాషలో మాట్లాడారని, వాటి అర్థాలు బతుకు, చావు అని తెలిపారు. అయితే, ప్రజలు మాత్రం బతుకు కన్నా చావు కోసమే ఎక్కువ అరుపులు వినిపించేలా కేకలు వేస్తున్నారని అన్నారు. అంత దీనంగా పరిస్థితులున్నాయని ఆయన తెలిపారు.