Home > Featured > హైదరాబాద్‌లో ప్లెక్సీల వార్.. బైబై మోదీ

హైదరాబాద్‌లో ప్లెక్సీల వార్.. బైబై మోదీ

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్లెక్సీల వార్ మొదలైంది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు భారీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ప్లెక్సీలలో ‘సాలు మోదీ. సంపకు మోదీ’ అని రాసి, యాష్ ట్యాగ్ పెట్టి 'బైబై మోదీ' అంటూ ముద్రించారు. ప్రస్తుతం ఈ ప్లెక్సీలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జూలై 2,3 తేదీల్లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు సంబంధించి తెలంగాణలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ ప్లెక్సీలు వెలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో భారీ ప్లెక్సీలను ఏర్పాటు చేయడం హాట్ టాఫిక్‌గా మారింది.

అయితే, పెక్ల్సీలలో నల్లధనం వెనక్కి తెప్పించడం, నోట్ల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, రైతు చట్టాలు, అగ్నిపథ్ వంటి అంశాలను ప్లెక్సీలో ముద్రించారు. దీంతో విషయం తెలుకున్న పోలీసులు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో భారీగా మోహరించారు. ఎక్కడ ఏ ఆందోళన జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ సిబ్బంది గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలను తొలగించారు. అయితే వ్యవహారం వెనుక టీఆర్ఎస్ నేతల హస్తం ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

Updated : 29 Jun 2022 1:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top