95వ ఆస్కార్ వేడుకలు ముగిశాయి. అంగరంగ వైభవంగా ఈ వేడుకలను నిర్వహించారు. మొత్తం 23 విభాగాల్లో విజేతలను ప్రకటించి అవార్డులను అందజేశారు. 95వ అకాడమీ అవార్డ్స్‌లో భారతీయ చిత్రాలకు రెండు అస్కార్ అవార్డుల దక్కాయి. ఇక రేసులో నిలిచి అవార్డులు సొంతం చేసుకోని వారికి అదిరిపోయే గిఫ్ట్‌లను ఇచ్చారు. ఈ బహుమతుల విలువ సుమారు రూ.కోటి వరకు ఉండొచ్చు.
ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి కేటగిరీల్లో పోటీ పడి, అవార్డు దక్కని వారికి ప్రతీ ఏడాది అవార్డులను అందిస్తారు. ఈ అవార్డులను లాస్ ఏంజిల్స్ కు చెందిన ‘డిస్టింక్టివ్ అస్సెట్స్’ కంపెనీ ఇస్తోంది. అస్కార్ అకాడమీతో ఎలాంటి డీల్ లేకపోయినప్పటికీ 2002 నుంచి ‘ఎవ్రి వన్ విన్స్’ పేరుతో ఈ బహుమతులను ఇస్తోంది.
డిస్టింక్టివ్ అస్సెట్స్ అందిస్తున్న గిఫ్ట్ విలువు రూ.1.03 కోట్లు వరకు ఉండొచ్చు. వారి బహుమతుల్లో జపాన్ మిల్క్ బ్రెడ్, ఇటాలియన్ ద్వీపానికి వెళ్లేందుకు ట్రిప్, ఆస్ట్రేలియాలో ఒక ప్లాట్.. ఇలా మొత్తం 60 బహుమతులు ఉన్నాయి.అని ది గార్డియన్ పత్రిక వెల్లడించింది.ఈ గిఫ్ట్ బ్యాగ్‌లను కొంతమంది తీసుకుంటే పలువురు తిరస్కరిస్తారు.
ఆస్కార్ వేడుకలకు భారీగా ఖర్చు చేశారు. ప్రపంచ దేశాలకు ఆథిద్యం ఇచ్చే దగ్గరనుంచి వేడుకలు జరిపే వరకు దాదాపే 56.6 మిలియన్ డాలర్లను వెచ్చించారు. అంటే భారత్ కరెన్సీ ప్రకారం రూ.463,92,47,300 అన్నమాట. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటునాటు’ తెలుగు వెర్షన్ పాటకు బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కింది.మరోవైపు ఇండియాకు చెందిన ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ బెస్ట్ షార్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్ అవార్డు కొల్లగొట్టింది.