ప్రసాద్ ఆవేదనకు మా అక్షర రూపం...! GST..GST..GST - MicTv.in - Telugu News
mictv telugu

ప్రసాద్ ఆవేదనకు మా అక్షర రూపం…! GST..GST..GST

July 8, 2017

నరేంద్రమోడీ గారు నమస్కారం,

నాపేరు ప్రసాద్ హైద్రాబాద్ లోని బాలానగర్ లో చిన్న ఇండస్ట్రీ నడుపుతాను,నెలకి 2 లక్షలు దాకా ఆదాయం వస్తుంది,అంటే యేడాదికి 24 లక్షలు,నిజాయితీగా అయితే యేడాదికి కనీసం 3 లక్షల ఆదాయం పన్నుకట్టాలి మినాహాయింపులన్నీ పోను,అయితే నేను జస్ట్ 30 వేలు మాత్రమే పన్నుకడతాను,ఎందుకంటే నేను ఓ మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టా..కష్టపడి చదివి కొన్నాళ్లు ఉద్యోగం చేసి పైసా పైసా కూడబెట్టి  ఇపుడు స్వంత ఇండస్ట్రీ పెట్టుకొనే దశకి చేరుకున్నాను,నా సంపాదన 2లక్షల్లో..ఒక లక్ష నా కుటుంబ అవసరాలకు సరిపోతుంది, మిగతా లక్ష భూములు బంగారంలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తాను.నేను కర్చుపెట్టే లక్షరూపాయల్లో దాదాపు 30 వేలు పురోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వం రాబట్టుకుంటుంది,కిరాణా సరుకుల దగ్గర నుంచి టీవీ మొబైల్ ఏది కొన్నా 20 నుంచి 30 శాతం పన్ను.ఇక ఫ్రెండ్స్ తో మందు పార్టీ చేసుకుంటే  3000 ఖర్చు.అయితే దాదాపు 60% ప్రభుత్వానికి పన్ను. కారుకు పెట్రోల్ కొట్టిస్తే లీటర్కి 30రూపాయల పన్ను,కారు కొన్నప్పుడు అన్ని టాక్సులు కలిపి ప్రభుత్వానికి లక్షన్నర చెల్లించా,ఇంటి స్ధలంకొంటే లక్ష రూపాయలు రిజిస్ట్రేషన్ కోసం కట్టా,ప్రభుత్వం కనీసం మట్టిరోడ్డు కూడా వేయని మాకాలనీలో స్ధలం కొన్నందుకు ప్రభుత్వం డెవ్ లప్ మెంట్ ఛార్జీల పేరుతో 50,000  వసూలు జేశింది,ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత అధ్వానంగా ఉన్నాయో చూసాకా..కార్పోరేట్ ఆస్పత్రులు ఎంత దోపిడీ చేస్తున్నాయో చూసాక,తప్పక హెల్త్ ఇన్సురెన్స్  పాలసీ తీస్కుంటే  సిగ్గుకూడాలేకుండా..ప్రభుత్వం దానిపైన సర్వీస్ టాక్స్ వేసింది.దారి దోపిడీ దొంగలు దోచుకున్నట్టు ప్రతీదానిమీద..ఆఖర్కి స్మశానంలో శవదహనంమీద కూడా పన్నులేస్తున్న ప్రభుత్వం..మాకు తిరిగి ఏమిస్తుంది.

గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లల్ని చేర్పిస్తే చదువస్తుందనే నమ్మకముందా ?గవర్నమెంట్ ఆస్పత్రుల్లోకి వెళ్తే ఆరోగ్యాలతో తిరిగస్తామనే నమ్మకముందా?దేశ రక్షణ. రోడ్లేయడం తప్ప చేస్తున్న అభివృద్ది పనులేమిటో మాకర్ధంకావట్లేదు,కారుకొంటే  రోడ్ టాక్స్, రోడ్డెక్కితే టోల్ టాక్స్, తోలు తీసేస్తున్నారు కదా సార్..

ఇక మా పన్నుల డబ్బు ఏమైపోతుంది..?

మా ఇండస్ట్రీలో పనిచేసేవారికి జీతం పెంచాలంటే.. వారు ఎంత పని జేస్తారు,ఎలా పనిజేస్తారు..అని ప్రతీయేడు చూసి ఇంక్రిమెంట్ ఇస్తాం.కానీ ఈప్రభుత్వాలు ఏం చేస్తున్నాయ్..ఉద్యోగి పనిచేసినా చెయ్యకపోయినా..అధ్వానంగా చేసినా అందరికి ఒకే జీతం,ఒకే ఇంక్రిమెంట్,మా సొమ్మంటే అంత లోకువా..పైగా మా పన్నుల డబ్బుతో జీతాలు తీస్కుంటూ మాపనులు చెయ్యాలంటే ఫోజులు కొడ్తారు.పది గంటలకు ఆఫీస్ అంటే 11 గంటలకొస్తారు, లంచంలేకుండా ఒక్కపనికూడా చెయ్యరు,మరి ఎందుకు సార్ మేం ప్రభుత్వానికి పన్నులు కట్టాలి.ఇండస్ట్రీ నడవాలంటే కరంట్ వాళ్ల దగ్గరనుంచి ప్రతీ ఒక్కరికి లంచం ఇవ్వాలి,అందరికి కలిపి సుమారు పదివేలు లంచం ఇవ్వాల్సస్తుంది,ఆ లంచాలన్నీ వైట్ లో చూపించడం ఎలా సార్?అందుకే సార్ మాకు ప్రభుత్వానికి పన్నులు కట్టాలంటే మాకు కడుపు మండిపోతుంది,అలాగననీ నేను సామాజిక భాద్యతలేని వాన్ని కాదుసార్,మీరు సైనిక నిధికి విరాళం ఇవ్వమంటే పదివేలిచ్చా..మాదగ్గరలో ఉన్న అనాథాశ్రమానికి యేడాదికి 20 వేలు ఇస్తా..మా ఊళ్లో  స్కూల్ బాగుచేస్తామంటే  మానాన్న పేరుమీద లక్ష డొనేషన్ ఇచ్చా,కానీ ప్రభుత్వానికి పన్ను కట్టాలంటే నాకు మనసొప్పదు సార్,ఒకే ఇదంతా గతం ఇపుడంతా వైట్ మనీలోనే వ్యవహారాలన్ని చేద్దాం,మీరు డిసైడ్ చేస్తారు కాబట్టి..నాదగ్గరున్న 10 లక్షల బ్లాక్ మనీకీ ముప్పై శాతం..అంటే 3 లక్షలు కట్టి మొత్తం వైట్ మనీలోకి మార్చుకుంటా..కానీ రేపటినుంచి నేను నెలకు పదివేలు లంచం ఇవ్వకుండా పనులు అవుతాయనీ..గ్యారంటీ ఇస్తారా?లేదా లంచాల్ని చెక్ రూపంలో తీస్కొమ్మని ఉద్యోగులకి పర్మిషన్ ఇస్తారా..?

ఇక నాయకుల సంగతి చెప్పలేదు కదా..మాగల్లీ లీడర్ దగ్గర్నుంచి ఎమ్మెల్యే దాక అందరి ఎలక్షన్లకి అన్ని పార్టీల వాళ్లకి విరాళాలు ఇవ్వాలి.లేకపోతే ఇబ్బంది పెడతారు,వీళ‌్లను కూడా విరాళాలు చెక్కుల రూపంలో తీస్కొమ్మని చట్టం తెస్తారా?పార్టీల డబ్బల లెక్కల్ని రహస్యంలేకుండా ఓపెన్ గా చెప్తారా?ఇప్పటికే బోలెడు పన్నులు కడ్తున్న మాకు ..ప్రభుత్వం ఏం సేవలిస్తుందో చెప్పండి..నాయకుల జల్సాలకోసం ఉద్యోగుల జీతాలకోసమైతే మేం పన్నులు కట్టం సార్..వీలైనంత ఎగ్గొడ్తాం,పదేళ్లకి మళ్లీ దేశంలో బ్లాక్ మనీ పెరిగిపోతుంది,అప్పుడు మళ్లీ నోట్ల మార్పిడీ తెస్తారా?ఇందుకు కాద్ సార్ మిమ్మల్ని ఎన్నుకుంది..మీ నిర్ణయంవల్ల రెండు రోజులుగా చేతిలో డబ్బులేక ఇబ్బంది పడ్తున్న మావర్కర్స్ కూడా  మీమీద నమ్మకంతో ఈ ఇబ్బందిని సంతోషంగా భరిస్తున్నారు.ముందు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి సార్, మేం కడ్తున్న పన్నులకి న్యాయం చెయ్యండి.అపుడు మేం కూడా న్యాయంగా పన్నులు కడ్తాం.రెండు చేతులు కలిస్తేనే సార్ చప్పట్లు,మా చెయ్యిరెడీ మీ చేత కోసం ఎదురు చూస్తుంటాం.

ఇట్లు

ప్రసాద్