పీఎం కేర్స్ నుంచి వలస కార్మికులకు రూ.1000 కోట్లు.. - Telugu News - Mic tv
mictv telugu

పీఎం కేర్స్ నుంచి వలస కార్మికులకు రూ.1000 కోట్లు..

May 13, 2020

PM CARES

కరోనా బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వానికి విరాళాలు అందించాలని ప్రధాని మోదీ ‘పీఎం కేర్స్’ అనే ట్రస్ట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. ఈ ట్రస్ట్ కు భారీగా విరాళాలు వచ్చి చేరాయి. వాటి నుంచి ఈరోజు రూ.3100 కోట్ల నిధులను విడుదల చేశారు. వీటిలో రూ.2వేల కోట్లు వెంటిలేటర్ల కొనుగోలుకు, రూ. వెయ్యి కోట్లను వలస కార్మికుల కోసం, మరో రూ.100 కోట్లను వాక్సిన్ అభివ‌ృద్ధి కోసం కేటాయించారు. 

లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న సంగతి తెల్సిందే. వాళ్ళ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. వెయ్యి కోట్లు మంజూరు చేశారు. వలస కార్మికుల వసతి, భోజన సదుపాయాలు, వైద్య చికిత్స, రవాణా కోసం కేటాయిస్తారు. ఈ నిధులను వలస కార్మికుల కోసం జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఖర్చు చేస్తారు. అలాగే రూ.2 వేల కోట్లతో దాదాపు 5వేల మేడిన్ వెంటిలేటర్లను కొనుగోలు చేయనున్నారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కోవిడ్ ఆస్పత్రులకు అందజేయనున్నారు.