నిరుద్యోగులకు ప్రధాని గుడ్‌న్యూస్..10 లక్షల ఉద్యోగాలకు.. - MicTv.in - Telugu News
mictv telugu

నిరుద్యోగులకు ప్రధాని గుడ్‌న్యూస్..10 లక్షల ఉద్యోగాలకు..

June 14, 2022

దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిరుద్యోగులకు ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉద్యోగాలను వచ్చే ఏడాదిన్నర కాలంలో నియామకాలు చేపట్టాలని సూచించారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అన్ని శాఖల, విభాగాల మానవ వనరుల పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.

అనంతరం ‘‘మిషన్ మోడ్‌లో వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల మంది నియామకాలు చేపట్టాలి” అని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి, నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు వెలువడుతాయి అని ఆయా రాష్ట్రాల నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై ఉద్యోగాల విషయంలో తరచూ తెగ విమర్శలు చేస్తున్నారు. కేంద్రంలో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ, పలు మీడియా సమావేశాల్లో లెక్కలతో సహా వివరాలను వెల్లడిస్తూ, వస్తున్నారు.

ఈ క్రమంలో నిన్న ప్రధాని మోదీ అన్ని శాఖల అధికారులతో ఉద్యోగ ఖాళీలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, ఖాళీల వివరాలపై చర్చించారు. అనంతరం వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల మంది నియామకాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేస్తూ, ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనతో నిరుద్యోగుల విషయంలో, ఉద్యోగాల విషయంలో మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న వారికి సమాధానం చెప్పినట్లైందని పలువురు బీజేపీ నాయకులు భావిస్తున్నారు.