PM Kisan money release tomorrow
mictv telugu

రేపు పీఎం కిసాన్ డబ్బులు విడుదల

May 30, 2022

PM Kisan money release tomorrow

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు బంధు పథకం స్పూర్తితో కేంద్రం ఇస్తున్న పీఎం కిసాన్ 11వ విడత నిధుల గురించి కీలక అప్‌డేట్ వచ్చింది. రేపు అనగా మంగళవారం రూ. రెండు వేలను రైతుల ఖాతాల్లో వేయనున్నట్టు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం వెల్లడించారు. దాదాపు 20 వేల కోట్లను ఒక్క బటన్ నొక్కి నిధులు జమ చేస్తామని ప్రకటించారు.

కాగా, ఈ పథకం ప్రయోజనాలు అనర్హులు వాడుకుంటున్నారని ఆరోపణలు రావడంతో కేంద్రం అలర్ట్ అయింది. అలాంటి వారి నుంచి డబ్బు రికవరీకి చర్యలు ప్రారంభించింది. అలాగే ప్రతీ రైతు కూడా ఈ కేవైసీ చేయించుకోవాలని నిర్ణీత గడువు కూడా విధించింది. ఈ కేవైసీ చేయించుకోని రైతులకు ఈ ప్రయోజనం అందదు.