నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ఒకటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం. ఈ పథకం ద్వారా నిరుపేదలపైన రైతులకు లబ్ది చేకూరన్న లక్ష్యంతో..రైతులకు ప్రతి ఏడాది రూ. 6వేల చొప్పున వారి ఖాతాల్లోకి జమ చేస్తుంది ప్రభుత్వం. పంటల ఖర్చుల కోసం మూడు విడతల్లో రూ. 2వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకంలో ఎన్నో అక్రమాలు జరుగుతుండటంతో మోదీ ప్రభుత్వం కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. అర్హులైన రైతులే కాకుండా అనర్హత ఉన్న రైతులు కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం పలు పథకాలు అమలు చేస్తుంటే…కేంద్రం కూడా వివిధ వర్గాల కోసం పథకాలను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పథకం ద్వారా డబ్బులు పొందుతున్న రైతులకు ఈ -కేవైసీ తప్పనిసరి. ఈ-కేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఎప్పటినుంచో రైతులకు చెబుతోంది. అయినా కూడా ఇంకా కొంతమంది రైతులు దీన్ని పూర్తి చేయలేదు. అలాంటి రైతులకు ఈ పథకం కింద ప్రయోజనం పొందే అవకాశం ఉండదు. డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది.
13వ విడత డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులు ఇప్పటికైనా దీనిని పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. మీ వాయిదాల డబ్బులు ఆగిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవడం ముఖ్యమని ప్రభుత్వం కూడా చెబుతోంది.
ఈకేవైసీ ఎలా చేయాలి:
మీ ఈ కేవైసీ రెండు విధాలుగా చేయవచ్చు. ముందుగా మీరు ఈ స్కీం pmkisan.gov.in అధికారిక వెబ్ సైట్ కు లాగిన్ అవ్వాలి. ఓటీపీ అడుగుతుంది. ఇది కాకుండా మీరు మీకు సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రాల్లో లేదా ఇతర ఆన్ లైన్ సెంటర్లలో కూడా దీన్ని పూర్తిచేసుకోవచ్చు.
భూమికి సంబంధించిన పత్రాలు:
రైతులు ఈకేవైసీ పూర్తి చేసినా…డబ్బులు నిలిచిపోకుండా ఉండాలంటే వీలైనంత త్వరగా మీ భూమికి సంబంధించి వెరిపికేషన్ పూర్తి చేయాలి. కేవైసీ చేసి ఇది చేయకుంటే డబ్బులు నిలిచిపోతాయి.
13వ విడత డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి:
ఈపథకం కింద ఇప్పటివరకు 12వ విడత డబ్బులు రైతులు అకౌంట్లో జమ అయ్యాయి. ఇప్పుడు 13వ విడత డబ్బులు ఇప్పటికే రైతుల అకౌంట్లో జమ అయినట్లు సమాచారం.