ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం హిమాచల్ ప్రదేశ్ పర్యటించారు. ఈ పర్యటనలో ప్రధానికి ఓ బాలిక నుంచి అరుదైన కానుక లభించింది. ఆ రాష్ట్ర రాజధాని సిమ్లాలో రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డ జనానికి అభివాదం చేస్తూ ప్రధాని మోదీ కాన్వాయ్ వేగంగా వెళ్తోంది. అయితే, ఓ చోట ఉన్నట్టుండి తన కాన్వాయ్‌ను ఆపిన మోదీ.. తర్వాత కారులో నుంచి దిగారు. ఆ జన సమూహంలో బారికేడ్లకు ఆవతల నిలబడి ఉన్న ఓ బాలిక వద్దకు వెళ్లారు.
ఆ చిన్నారి చేతిలోని పెయింటింగ్‌ను తీసుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. బారికేడ్లకు ఆవలే నిలబడీ మరీ బాలిక మోదీ కాళ్లకు నమస్కరిస్తే… ప్రధాని ఆ చిన్నారిని ఆశీర్వదించారు. ఆ బాలిక మోదీ మాతృమూర్తి పెయింటింగ్‌ను గీయడం విశేషం. దీంతో కాన్వాయ్‌లో స్పీడుగా వెళుతున్న మోదీ… తన తల్లి పెయింటింగ్ చూడగానే తన నిలిపేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
PM @narendramodi stopped his car to accept the painting from a girl in Shimla, Himachal Pradesh. pic.twitter.com/eHnUlS1GC4
— BJYM (@BJYM) May 31, 2022