మోదీ-అమిత్ షాలపై చీటింగ్ కేసు - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ-అమిత్ షాలపై చీటింగ్ కేసు

February 4, 2020

Rs 15 lakh.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలపై కోర్టులో చీటింగ్ కేసు నమోదైంది. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ పలు హామీలిచ్చిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి.. దేశంలోని ప్రతీ పౌరుడి ఖాతాలో రూ.15లక్షలు జమ చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చి ఆరేళ్ళు కావస్తున్నా.. ఆ హామీని నిలబెట్టుకోలేదు. దీనిపై తరుచూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. 

తాజాగా ఇదే అంశంపై జార్ఖండ్‌లోని రాంచీ కోర్టులో హెచ్‌కె సింగ్ అనే ఓ లాయర్ మోదీ, అమిత్ షాలపై సెక్షన్ 415 (మోసం), సెక్షన్ 420(దగా) కింద ఫిర్యాదు చేశారు. వాటితో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123(బి)కూడా చేర్చారు. తాము అధికారంలోకి రాగానే ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు జమ చేస్తామని చెప్పి.. ప్రజలను మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదును న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.