PM Modi, Amit Shah Wish Veteran BJP Leader Advani On His 95th Birthday
mictv telugu

అద్వానీ..ఆనాటి జ్ఞాపకాలు

November 8, 2022

Advani,PM Modi,BJP,AmithShah, veteran BJP leader,95th Birthday

కల నెరవేరింది. సుస్థిర ప్రభుత్వం వచ్చింది. ఒక్కసారి కాదు రెండు పర్యాయాలు. ముచ్చటగా మూడోసారి వస్తామనే ధీమా.రామమందిర నిర్మాణం పూర్తికాబోతోంది. వచ్చే ఏడాది జనవరిలో గర్భగుడి ప్రవేశానికి అనుమతి ఇవ్వబోతున్నారు. కమలం రెండు స్థానాల నుంచి మూడొందల స్థానాలు దాటాయి. పార్టీ కోసం జీవితాన్నే ధారపోసిన అద్వానీ ఇవన్నీ దూరం నుంచే చూస్తున్నారు. అధికారికంగా దేనిలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. అదే వేరే పార్టీలో ఇలాంటి వెటరన్ లీడర్ ఉంటే కథ వేరే లెవల్లో ఉండేది. 95వ యేటా అడుగుపెట్టిన అద్వానీ…..రాష్ట్రపతి కావాలన్న బీజేపీ కార్యకర్తల కల కలగానే మిగిలిపోయింది.

Advani,PM Modi,BJP,AmithShah, veteran BJP leader,95th Birthday

రెండు స్థానాల నుంచి…

ఒకప్పుడు అద్వానీ అంటే బీజేపీ.బీజేపీ అంటే అద్వానీ. అప్పట్లో ప్రధానిగా వాజ్‌పేయి,పార్టీ అధ్యక్షుడిగా, ఉపప్రధానిగా అద్వానీ తనదైన ముద్రవేశారు. రెండుస్థానాల కమలాన్ని ఢిల్లీ పీఠమెక్కించారు. భవిష్యత్‌కు గట్టి పునాదులు వేశారు దేశంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా పార్టీని తీర్చిదిద్దారు. . ఇప్పుడు అంతా మోదీషా మాయం.వెటరన్ లీడర్లు జన్మదినోత్సవాలప్పుడు తప్ప మిగతా సమయాల్లో మచ్చుకైనా గుర్తుకురారు. ప్రతిబర్త్ డేకు అద్వానీ ఇంటకెళ్లి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంగళవారం 95 వ ఏటా అద్వానీ అడుగు పెట్టారు. ఎప్పటిలాగే మోదీ, రాజ్ సింగ్‌లు వెళ్లారు. కాసేపు ఆయనతో మోదీ మాట్లాడారు. అద్వానీ పార్టీకి సేవల్ని అమిత్ షా ట్వట్టర్‌లో గుర్తు చేశారు. అద్వానీ చేసిన సేవలు వెలకట్టలేనివని, పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు. దేశాభివృద్దికి ఎంతో కృషి చేశారు. అద్వానీ ఎంతో మంది నేతలకు స్ఫూర్తిదాయకమన్నారు నితిన్ గడ్కరీ. రాజ్‌నాథ్ తో పాటు చాలామంది బీజేపీ నేతలు అద్వానీ సేవల్ని గుర్తు చేశారు. “దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర ఎంతో కీలకం.ఆయన విజన్, మేధోతనం దేశానికి ఎంతో ఉపయోగపడింది పార్టీ, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించారు.అద్వానీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా” అని మోదీ అన్నారు.

Advani,PM Modi,BJP,AmithShah, veteran BJP leader,95th Birthday

అద్వానీ నేపథ్యం

అద్వానీ 1927 లో కరాచీలో జన్మించారు. కరాచీ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది. తొలుత ఆరెస్సెస్ లో పనిచేశారు. ఆతర్వాత జన సంఘ్‌కు సేవలందించారు.. 1980లో ఏర్పడిన బీజేపీ వ్యవస్థాపకుల్లో అద్వానీ ఒకరు. వాజ్‌పేయితో కలిసి దశాబ్ధాలపాటు పనిచేశారు. పార్టీలో మంచి వ్యూహకర్త.ఆయన మాటకు తిరుగులేదు. అద్వానీ స్పీచ్ అంటే ఆ పార్టీ కార్యకర్తలు చెవికోసుకునేవాళ్లు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం 1990లో యాత్ర నిర్వహించారు. దేశ రాజకీయాల్ని ఈ యాత్ర మలుపు తిప్పింది. దేశంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైంది. బీజేపీలో అతివాద నాయకుడిగా విపక్షాలు ముద్రవేశాయి. పార్టీలో నెంబర్ వన్‌గా ఉన్నా…సౌమ్యుడు, మితవాది అయిన వాజ్‌పేయినే ప్రధాని పదవి వరించింది. ప్రధాని వాజ్‌పేయి కేబినెట్‌లో హోం మంత్రిగా, ఉప ప్రధానిగా అద్వానీ పనిచేశారు.

మోదీ షా వచ్చాక

నరేంద్ర మోదీ దేశరాజకీయాల్లోకి వచ్చాక అద్వానీ క్రమంగా పార్టీపై పట్టుకోల్పోయారు. 75 ఏళ్ల నిబంధన అడ్డంకిగా మారింది. రాష్ట్రపతి పదవి ఇస్తారని బీజేపీ కార్యకర్తలు భావించారు. మోదీషా ఆ ప్రస్తావన రాకుండా చూశారు.పార్టీ కోసం ఎంతో కష్టపడిన అద్వానీ రాష్ట్రపతి కాలేదనే బాధ బీజేపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌లో ఉంది.