ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆర్ఆర్ఆర్ టీంకు అభినందనలు తెలియజేశారు. అసాధారణమైన ఘనత సాధించిన నాటనాటు పాటకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉందన్నారు.
ఈ పాట ఏళ్ల తరబడి గుర్తుండిపోతుందన్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును దక్కించుకున్న కీరవాణి, చంద్రబోస్ లతో మొత్తం టీంకు అభినందనలు తెలిపారు మోదీ. భారతదేశం గర్వపడుతోందని పేర్కొన్నారు.
మోదీ ఇలా ట్వీట్ చేశారు:
ప్రధాని మోదీ తన ట్వీట్‌లో ఇలా రాశారు, “అసాధారణమైనది! ‘నాటు నాటు’కి ప్రపంచవ్యాప్త ఆదరణ ఉంది. ఇది రాబోయే సంవత్సరాల్లో గుర్తుండిపోయే పాట అవుతుంది. ఈ ప్రతిష్టాత్మక గౌరవం కోసం MM కరవాణి, చంద్రబోస్ మొత్తం బృందానికి అభినందనలు . భారతదేశం గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు.
అటు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్ఆర్ఆర్ టీంను ప్రశంసించారు. ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. హాలీవుడ్ గడ్డపై ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ…ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకోవడం తెలుగువారిగా మనందరం గర్వపడాలన్నారు.