భయపడొద్దు.. మీకు నేనున్నా : ప్రధాని మోదీ - MicTv.in - Telugu News
mictv telugu

భయపడొద్దు.. మీకు నేనున్నా : ప్రధాని మోదీ

December 12, 2019

PM Modi 020

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ బిల్లుపై అస్సాంలో నిరసనలు మిన్నంటాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. తమ అస్థిత్వం, భూ హక్కులు, భాషపై ఈ బిల్లు ప్రభావం చూపుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి వాదనలపై ప్రధాని మోదీ స్పందించారు. దీనిపై ఆయన అస్సాం ప్రజలకు భరోసా ఇస్తూ ట్వీట్ చేశారు. 

‘మీ మనోభావాలకు ఎలాంటి భంగం కలగదు అస్సాం సోదర సోధరీమణులు ఎవరూ ఆందోళన చెందవద్దు. పౌరసత్వ సవరణ బిల్లు ఎవరి హక్కులు హరించదు. మీ అస్సాం గుర్తింపు,సంస్కృతి, అభివృద్ధి మరింత పెరిగేలా చూస్తాం. మీరెవరూ భయపడొద్దు మీకు నేను ఉన్నా’ అంటూ భరోసా నింపే ప్రయత్నం చేశారు. కాగా ఈ బిల్లు చట్ట సభల్లో ఆమోదం పొందడంతో రాష్ట్రపతి త్వరలోనే దీనికి ఆమోదం తెలపనున్నారు. దీన్ని ఇప్పటికే కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి.