కేంద్ర కేబినెట్ భేటీ.. మీటరున్నర దూరం కూర్చున్న మంత్రులు - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్ర కేబినెట్ భేటీ.. మీటరున్నర దూరం కూర్చున్న మంత్రులు

March 25, 2020

PM Modi Cabinet Follows Social Distancing

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ప్రజలను అప్రమత్తం చేశారు. దీనిపై ప్రధాని మోదీ మంత్రులతో తన నివాసంలో సమావేశం అయ్యారు. వ్యాధిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రజల్లో ఇంకా సామాజిక దూరంపై అవగాహన పెంచే అంశాలను కూడా పరిశీలించారు. 

దీంట్లో భాగంగా ప్రజలకు స్పూర్తిగా నిలిచేలా మంత్రి వర్గాన్ని సమావేశపరిచారు. ప్రతి మంత్రికి మధ్య కనీసం మీటరున్నర దూరం ఉండేలా చూసుకున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కాగా ఇప్పటికే ప్రజలు లాక్‌డౌన్ పెద్దగా పట్టించుకోవడం లేదని ప్రధాని సీరియస్ అయ్యారు. వైరస్ వ్యాపించకుండా ముందస్తుగా తీసుకున్న నిర్ణయంపై బాధ్యత లేకుండా వ్యహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ భేటీలో సామాజిక దూరం ఆసక్తిగా మారింది.