గతంలో ‘గుజరాత్ ఫైల్స్’ని ద్వేషంతో ఆపేశారు : మోదీ - MicTv.in - Telugu News
mictv telugu

గతంలో ‘గుజరాత్ ఫైల్స్’ని ద్వేషంతో ఆపేశారు : మోదీ

May 28, 2022

తన ఎనిమిదేళ్ల పాలనలో గుజరాత్ ప్రజలు సిగ్గుపడేలా ఏ పనీ చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శనివారం రాజ్ కోట్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా గాంధీ, పటేల్ కలలు సాకారమయ్యే దిశగా పని చేశానని వెల్లడించారు. పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలు సాధికారత సాధించే పనులు చేశానని వివరించారు. అందులో భాగంగా జన్ ధన్ యోజన, పీఎం కిసాన్, ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలను అమలు చేసినట్టు గుర్తు చేశారు. కరోనా సంక్షోభాన్ని ప్రజల సహకారంతో దాటగలిగామని, వ్యాక్సిన్ విషయంలో దాదాపు సక్సెస్ అయినట్టేనని తెలిపారు. తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం గుజరాత్ ప్రజలేనని, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం వేధింపులను ప్రజలకు తెలియజేశారు. ‘నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం గుజరాత్ ఫైళ్లకు ఆమోదం తెలిపేది కాదు. రాష్ట్రానికి మేలు చేసే ప్రాజెక్టులకు వారు పర్మిషన్ ఇచ్చేవారు కాదు. గుజరాత్ ఫైల్స్‌ని బ్లాక్ చేసి నన్ను ద్వేషించేవారు’ అని తన అనుభవాలను చెప్పుకొచ్చారు.