ఇద్దరూ ఇద్దరే...కాకా పోతో... గీయన కొంచెం డిఫరెంట్..... - MicTv.in - Telugu News
mictv telugu

ఇద్దరూ ఇద్దరే…కాకా పోతో… గీయన కొంచెం డిఫరెంట్…..

June 30, 2017

మన ప్రధాన మంత్రుల ఇద్దరి ముచ్చటిది. ఓకాయన కాలు తీసి కాలు వెట్టిండంటే…. రోబో నడ్సినట్లే ఉండేది.. ఎవరి మీకిప్పటికే యాదికొచ్చింటది… ఇగ ఇప్పుడున్నాయనయితే… తన సకల కళలలను  ప్రయోగించి జనాలను సమ్మోహితులను చేస్తనే ఉన్నడు.. పాతన ఒగరి సేతిల తాలం చేయిఅయితే… ఈయన అందరీ తాళం చేతులు  తాన వొద్దనే  ఉంచుకున్నడు.. కాదు కాదు… గుంజుకున్నడని కొందరంటరు.

ఇగ  మోడీ గురించి… ఎంత తక్వ మాట్లాడితే… అంత తక్వ… ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎక్వ. ఇదేందో ఉల్టా… పల్టా ముచ్చట గాదు.. సీదా సీదా చెప్తున్నదే. ఉన్నదున్నట్లు చెప్పాల్నంటే… కొండవలగొట్టినట్లే చెప్పుడే. అయితే మరిప్పుడెందుకూ.. అంటర ఆడికే వస్తున్న….

మోడీ సారు ఇండియాకు ప్రధాన మంత్రి అయిన వెంటనే కొన్ని దేశాలు తిర్గివొచ్చిండు…  యాదుకుందా… అప్పట్ల జపాన్ వోయిండు… ఆడ డ్రమ్ము కొట్టిండు…  వొంగి కప్పులు  శాయి తాగిండు… అక్కటోళ్లు ఏస్కున్నట్లు… డ్రెస్ గూడ ఏస్కున్నడు.. అట్లనే బర్మాకు వోయినప్పుడైతే… అచ్చం ఆ దేశపాయన లెక్కనే బట్టలేసుకున్నడు. ఇక  చైనాకు వోయినప్పుడు అయితే….  కమ్యూనికేషన్ టెక్నాలజీకి… సెల్ ఫోన్ల వాడుట్ల తీస్మార్ ఖాన్లైన చైనా వోళ్లకు సెల్ఫీలు దిగి… చెమక్ న మెర్సిండు.

శ్రీలంక వోతే… లంక పౌరుని లెక్క బట్ట లేస్కోని…. ముచ్చట్లు వెట్టిండు. అట్ల రెండేండ్ల కాలంలనే ఇంత వరకు ఏ ప్రధాన మంత్రి తిర్గనన్ని దేశాలు తక్వ రోజుల్ల తిర్గి రికార్డు కొట్టిండు.. అంతే కాదు…  రోమ్ల  ఉంటే రోమన్ లెక్క ఉండాల్నననే సామెతను  పోత పోత సంకనేస్కోని పోయినట్లు… యే దేశాన్కి వోతే.. అట్లనే తాయారైండు… పాటలు వాడుడు.. తినుడు… డ్యాన్సులు చేసుడు… మల్లా ఎంటనే కోటు… సూటు.. బూటు…  గుజరాత్ డ్రెస్స్ లు… గిట్ల మస్తుగ బయటి దేశాల్ల జనాలను ఖుషీ ఖుషీ చేసిండు…

రెండు దినాల కింద అమ్రిక పోయినప్పుడు… ఆన్నుంచి ఇంకో దేశానికి వోయినప్పుడు అందర్నీ కౌగిలించుకుని…. ఆహా అన్పించిండు… చివరక ఐర్లాండ్  లీడర్ సైకిల్  ఇస్తే దినాం సైకిల్ తొక్కేటోళ్ల కంటే మా ఫోజు వెట్టి ఫోట్వలు దిగిండు… అట్ల ఆయననూ ఖుషీ చేసిండు… ట్రంప్ ను అయితే ముచ్చట్లతోనే మురిపించి వొచ్చిండు.

ఇగ  పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు జనాల కష్టాలు చూసి ఏం చేయాల్నో తోయక మీటింగులనే బోరు బోరు మని ఏడ్సిండు.. జనాల ఏడ్పు మర్సిపోనికే. ఇగ ఆ తర్వాత దేశంలో జరుగుతున్న పరిణామాలు చూసి….అయ్యో ఇట్ల కాదు కాదు కాదు అంటడు. కానీ అడుగు ముందుకేయడు.

నిన్నటి ప్రధానికి ఇప్పటి మోడీకి ఒక్క దాంట్ల మాత్రం మాంచి పోలికుంది. ఒకరి చేతిల తాళం చేయి లెక్కున్నాయన జనాలకు ఏం జర్గినా ఏ సాయం చేయలేదు… అందరి తాళం చేతులు తన వొద్ద వెట్టుకున్న మోడీ కూడా జనాలకు ఏమీ చేయడం లేదనే విమర్శ అయితే ఉంది.

కొసమెరుపు: బాహుబలి రికార్డుల మోత మోగించినట్లు మోడీ కూడా తన దైన బాటల ముందల్కి పోయిండు….. ఇంత  వరకు ఇండియన్ హిస్టరీలో ఏ ప్రధాని చేయనంతగా… యేడాది నుండి  జనాలను పైసలకు కటకటలాడే టట్లు చేసిండు. ఇంత కంటే ఏం గావాలే ఈయన మిగిలినోళ్ల కంటే డిఫరెంటని  చెప్పనీకే అని జనాలు అనుకుంటున్నరు.