మోదీ ప్రభుత్వం తుగ్లక్‌లా వ్యవహరిస్తోంది.. తలసాని - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ ప్రభుత్వం తుగ్లక్‌లా వ్యవహరిస్తోంది.. తలసాని

September 20, 2020

mmnb

తెలంగాణ పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం తుగ్లక్‌లా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కరోనా విషయంలో రూ.20 లక్షల కోట్ల నిధులు ఇస్తామని చెప్పిన కేంద్రం  ఇప్పటి వరకూ ఎలాంటి గైడ్‌లైన్స్‌ కూడా ఇవ్వలేదని తెలిపారు. తెలంగాణ పలు సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే ఓర్వలేకనే ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలతో పాటు దేశంలో కలిసి వచ్చే అందరు ఎంపీలతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడైనా మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూమ్‌ లాంటి పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. నేను ముందు నడుస్తుంటే కాంగ్రెస్‌ నాయకులు వెనక నుంచి లేనిపోని కామెంట్లు చేస్తారని.. కామెంట్లు భరించలేకనే మీరు వెళ్లిపొమ్మని చెప్పానని మంత్రి తలసాని చెప్పారు. 

ఇళ్ల లిస్టు వారికి పంపించి వెళ్లి చూసుకోమని చెప్పానని.. అన్నీ తిరిగితే లక్ష బెడ్‌రూమ్‌లు ఉన్నాయో లేవో వాళ్లకే తెలుస్తుందని అన్నారు. సోకాల్డ్‌ నేతలుగా చెప్పుకుంటున్నవారు సమాధానం ఇవ్వాలని అన్నారు. డబుల్‌ బెడ్‌‌రూమ్‌ ఇళ్ల దగ్గరకు తీసుకెళ్తే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. అందుకే వారికి సమాధానం చెప్పనవసరం లేదనుకున్నా అని వివరించారు. ‘కరీంనగర్‌ ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ ఏడాదిన్నరగా ఏం చేశారు? హైదరాబాద్‌లో కూర్చుని పిచ్చిపిచ్చిగా మాట్లాడ్డం తప్ప తన నియోజక వర్గానికి ఏమైనా చేశారా? నీకు దమ్ముంటే ప్రధానమ్రంతి వద్ద కూర్చుని డబ్బులు తెచ్చి చూపించాలి’ అని ఎంపీ బండి సంజయ్‌కు తలసాని సవాల్‌ విసిరారు.