అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన మోదీ - MicTv.in - Telugu News
mictv telugu

అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన మోదీ

February 21, 2020

xcbhfb

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అజ్మీర్ షరీఫ్ దర్గాలోని సూఫీ మత గురువు మొయినుద్దీన్ చిస్తీ సమాధిపై కప్పేందుకు చాదర్ పంపారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా మోదీ చాదర్ పంపడం సంప్రదాయంగా పెట్టుకున్నారు. అజ్మీర్ షరీఫ్‌కు చెందిన బృందానికి ఆయన ఈ చాదర్ అందించారు. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ నెల 25న చాదర్‌ను మొయినుద్దీన్ చిస్తీ సమాధిపై కప్పుతారు. దేశంలో శాంతి, సౌబ్రాతృత్వం వెల్లివిరియాలంటూ ప్రధాని పంపిన సందేశాన్ని కూడా అక్కడ చదువి వినిపిస్తారు.