ఎర్రకోటపై ఎగిరిన జెండా.. మోదీ వోకల్ ఫర్ లోకల్ నినాదం - MicTv.in - Telugu News
mictv telugu

ఎర్రకోటపై ఎగిరిన జెండా.. మోదీ వోకల్ ఫర్ లోకల్ నినాదం

August 15, 2020

PM Modi Independence Day Speech

దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు రాజ్ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులు అర్పించారు. కరోనా నేపథ్యంలో కేవలం దాదాపు 4 వేల మంది అతిథులు హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని వోకల్ ఫర్ లోకల్ అంటూ స్వదేశీ వస్తువులపై ప్రసంగించారు. అదే స్పూర్తితో అంతా పని చేసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశం ముందడుగు వేయడానికి సిద్ధమైందన్నారు. చైనాతో పాటు ఇతర దేశాల వస్తువులను కూడా నిషేధించి ఇకపై మన వస్తువులను మనమే తయారు చేసుకోవాలన్నారు. వోకల్ ఫర్ లోకల్ అనే మాటను నిలబెట్టుకుందామని ప్రధాని చెప్పుకొచ్చారు. దేశంలో సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయని అందుకే భారత్ కు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పారు. కరోనా ఆపత్కాలంలో దేశం ఏకతాటిపై నిలిచిందన్నారు. ఇక నుంచి బలమైన సంకల్పంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయ‌ప‌డ్డారు.