PM Modi inspects Morbi Bridge and meets injured peoples
mictv telugu

గుజరాత్ లో మోడీ పర్యటన.. కేబుల్ వంతెన ఘటనా స్థలం పరిశీలన

November 1, 2022

 PM Modi inspects Morbi Bridge and meets injured peoples

గుజరాత్ లోని మోర్బీ కేబుల్ వంతెన వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నదిలో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. మరోవైపు ఘటనా స్థలాన్ని నేడు ప్రధాని మోడీ పరిశీలించారు. కొనసాగుతున్న సహాయకచర్యలపై ఆరా తీసారు. అనంతరం ఆస్పత్రికి చేరుకుని.. ప్రమాదంలో గాయపడ్డ బాధితులను, వారి కుటుంబాలను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఆ తర్వాత ఎస్పీ కార్యాలయంలో ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించారు. కేబుల్ వంతెన ప్రమాదం జరిగిన తీరును, సహాయక చర్యలపై గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, అధికారులు ప్రధాని మోదీకి వివరించారు

మోర్బీలోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ వంతెన ఆదివారం సాయంత్రం కూలి 135 మంది చనిపోయారు. ఇంకా నదిలో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌తో పాటు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను చేపడుతున్నాయి. ఈ ప్రమాదంపై గుజరాత్‌ ప్రభుత్వం నియమించిన సిట్‌ బృందం దర్యాప్తు చేస్తోంది. కెపాసిటీకి మించి జనం వంతెనపై చేరడం తోనే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఆపరేషన్ వివరాలను మోడీ అడిగి తెలుసుకున్నారు. వంతెన కూలిన అనంతరం చేపట్టిన సహాయక చర్యలు.. ఇంకా తీసుకోవాల్సిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.