మోదీ కూడా నా కొడుకే.. ‘షహీన్ బాగ్’ బామ్మ - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ కూడా నా కొడుకే.. ‘షహీన్ బాగ్’ బామ్మ

September 25, 2020

‘PM Modi is my son’ says Shaheen Bagh’s Bilkis Dadi.

అమెరికాకు చెందిన ప్రముఖ టైం మ్యాగజైన్ ఈ ఏడాది ప్రకటించిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌ ఆందోళన పాల్గొన బిల్కిస్‌ దాదీ(82) చోటు దక్కించుకోవడం గమనార్హం. ఆమెతో పాటు ఇండియా నుంచి ప్రధాని మోదీ సహా మరో ముగ్గురు భారతీయులకు ఆ జాబితాలో స్తానం దక్కింది. బిల్కిస్‌ దాదీ 100 రోజుల పాటు పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. పొద్దున్నే 8కల్లా నిరసనకు కూర్చొనే ఆమె అర్ధరాత్రయినా కదిలేవారు కాదు. 

ఈ సందర్భంగా ఓ ఇంగ్లిష్ మీడియా సంస్థ చేసిన ఇంటర్వ్యూలో బిల్కిస్‌ దాదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మోదీ మిమ్మల్ని ఆహ్వానిస్తే ఆయనని కలవడానికి వెళతారా అని ఇంటర్వ్యూ చేసే మీడియా ప్రతినిధి అడిగినప్పుడు. ఆమె స్పందిస్తూ… ‘ఎందుకు వెళ్లను. తప్పకుండా వెళ్తాను. ఇందులో భయపడటానికి ఏం ఉంది. తను నా కొడుకు లాంటి వారు. నేను తనకు జన్మనివ్వకపోవచ్చు. మరో సోదరి ఆ పని చేసింది. అయినా తను నా బిడ్డలాంటి వాడే. ఈ జాబితాలో మోదీ పేరు కూడా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఆయనను అభినందిస్తున్నాను’ అని తెలిపారు.