రాజకీయాల్లోకి రాకుంటే ఏం అయ్యేవాడో చెప్పిన మోదీ - MicTv.in - Telugu News
mictv telugu

రాజకీయాల్లోకి రాకుంటే ఏం అయ్యేవాడో చెప్పిన మోదీ

November 24, 2019

ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ఏకచత్రాదిపత్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఏలేస్తున్నారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకొని పలు కీలక నిర్ణయాలతో విపక్షం, స్వపక్షంలో తిరుగులేని వ్యక్తిగా ఎదుగుతున్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్న మోదీ మన్‌కీ బాత్ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. తాను అసలు రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదని చెప్పారు. 

PM Modi Mankibat.

చిన్నతనం నుంచి తాను ఆధ్యాత్మిక భావనతోనే మెలిగానని చెప్పారు. ఆ మార్గంలో వెళ్లాలనే ఆర్ఎస్ఎస్‌లో చేరినట్టు తెలిపారు. కానీ అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. అసలు తాను రాజకీయాల్లోకి వస్తానని చిన్నతనంలో అనుకోలేదని తెలిపారు. అలాగే పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై కూడా ఆయన మాట్లాడారు. విజ్ఞానం కోసం పుస్తకాలు చదవడం మానేసి, గూగుల్‌లో విద్యార్థులు వెతుకుతున్నారని అన్నారు. శాంతి, సౌభ్రాతృత్వమే తమ ప్రభుత్వ విధానమని వెల్లడించారు.