చైనాకు ఎలా జవాబు ఇవ్వాలో తెలుసు.. మన్‌కీ బాత్‌లో ప్రధాని - MicTv.in - Telugu News
mictv telugu

చైనాకు ఎలా జవాబు ఇవ్వాలో తెలుసు.. మన్‌కీ బాత్‌లో ప్రధాని

June 28, 2020

PM Modi

సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని మోదీ స్పందించారు. రెచ్చగొట్టే వారికి ఎలా జవాబివ్వాలో భారత్‌కు బాగా తెలుసని చైనాకు పరోక్ష హెచ్చరికలు పంపారు. పొరుగు దేశాలతో తలెత్తిన సరిహద్దు తగాదాలను పరిష్కరించే సామర్థ్యం భారత్‌కు ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గల్వాన్ లోయ వద్ద అమరులైన భారత సైనికుల వీరోచిత పోరాటాన్ని కొనియాడారు. ప్రత్యర్థి దేశం విజయం సాధించకుండా మన జవాన్లు ఎదురొడ్డి నిలిచారని చెప్పారు. సైనికులను కోల్పోవడం బాధగా ఉందని ఆవేదన చెందారు. 

మరోవైపు దేశంలో విజృంభిస్తున్న కరోనాపై కూడా స్పందించారు. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లతో 2020 చెడ్డదిగా ముద్ర వేస్తున్నారని అన్నారు. ఈ సంవత్సరాన్ని ఉత్తమం చేయడానికి భారత పౌరులందర్నీ ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలని లేకపోతే..మనల్ని మనం ఉపద్రవంలోకి నెట్టుకున్నట్టేనని హెచ్చరించారు. ప్రస్తుతం భారత్ అన్‌లాక్ అవుతోందని, వివిధ రంగాల్లో స్వాలంభనకు అంతా కలిసి పని చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో భారత్ మరింత దృఢంగా తయారు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.