భారత ప్రధాని నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. మోదీ తల్లి హీరాబెన్(100) కన్ను మూశారు. రెండు రోజుల క్రితం ఆనోరోగ్యానికి గురైన హీరెబెన్..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామునా తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ.. హుటాహుటిన ఢిల్లీ నుంచి గుజరాత్ చేరుకున్నారు.
గుజరాత్‌లోని మెహసానాలోని వాద్నగర్ హీరాబెన్ మోదీ స్వస్థలం. ఆమె 1923 జూన్ 18న జన్మించారు. ఆమెకు ఐదుగురు కుమారులు. ప్రధాని నరేంద్ర మోదీ, పంకజ్ మోదీ, సోమ మోదీ, అమృత్ మోదీ, ప్రహ్లాద్ మోదీ. ఒక కుమార్తె వాసంతీబెన్ హస్ముఖ్లాల్ మోదీ ఉన్నారు. హీరాబెన్ మోదీ గాంధీనగర్ సమీపంలోని రైసన్ గ్రామంలో ప్రధాని తమ్ముడు పంకజ్ మోదీతో కలిసి నివసించేవారు. ఆమె ఇటీవల 100వ పుట్టిన రోజు జరుపుకున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఒకరోజు ముందు ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ను కలిశారు. ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ తన తల్లితో దాదాపు 45 నిమిషాలు గడిపారు.
మోదీ భావోద్వేగ ట్వీట్
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम… मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi
— Narendra Modi (@narendramodi) December 30, 2022
తల్లి మరణంపై ప్రధాని మోదీ ట్వీట్ చేసారు. ”దేవుడి పాదాల వద్ద అద్భుతమైన శతాబ్ధం ఉంది. సన్యాసి జీవితం, నిస్వార్థ కర్మయోగి, విలువలకు కట్టుడి ఉండే జీవితం వంటి త్రిమూర్తి లక్షణాలు అమ్మలో ఉన్నాయి. 100వ పుట్టిన రోజు సందర్భంగా నేను అమ్మను కలిసినప్పుడు ఆమె ఓ విషయం చెప్పింది. తెలివితో పని చేయండి, స్వచ్చతతో జీవించండి అని చెప్పారు. ఆ విషయాన్ని నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను.” అని రాసుకొచ్చారు