యూపీ సీఎంకు మోదీ ఫోన్.. హత్రాస్ అత్యాచార కేసుపై ఆరా  - MicTv.in - Telugu News
mictv telugu

యూపీ సీఎంకు మోదీ ఫోన్.. హత్రాస్ అత్యాచార కేసుపై ఆరా 

September 30, 2020

యూపీలో దళిత యువతిపై జరిగిన అత్యాచార ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. హత్రాస్ ఘటన వివరాలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేసి తెలుసుకున్నారు. దీనికి కారణమైన బాధ్యులైన  కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. వేగంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని పేర్కొన్నారు. దర్యాప్తు వివరాలను ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ వివరించారు.   

హత్రాస్ ఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందని సీఎం తెలిపారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టమన్నారు. ముగ్గురు సభ్యులతో ఓ ప్యానెల్ ఏర్పాటు చేసి విచారిస్తున్నామని చెప్పారు. వారం రోజుల్లో ఈ ప్యానెల్ రిపోర్టు ఇస్తుందని అన్నారు. కాగా 19 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. నాలుకను కోసేసి, ఎముకలు విరిచి వికృతానందం పొందారు. చాలా రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది మంగళవారం కన్నుమూసింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.