PM Modi Reacts To Mallikarjun Kharges Ravan Remark
mictv telugu

మల్లికార్జున ఖర్గేకు మోదీ స్ట్రాంగ్ కౌంటర్

December 1, 2022


కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రావణుడితో పోల్చడంపై సరిగ్గా గుజరాత్ తొలివిడత పోలింగ్ రోజు స్పందించారు. రామాయణాన్ని నమ్మరు గానీ…రావణుడ్ని ప్రస్తావన తెచ్చారన్నారు.

రావణుడితో పోల్చారు…

గుజరాత్ క్యాంపెయిన్‌లో మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీకేమైనా రావణుడిలా పదితలలు ఉన్నాయా అని అన్నారు. గుజరాత్ లో ఏ ఎన్నికల్లో చూసినా మోదీ కనిపిస్తున్నారన్నారు. మున్సిపల్ , కార్పొరేషన్ , అసెంబ్లీ ఎన్నికలు ఏవైనా మోదీ వస్తున్నారు. ఆయనకు ఓట్లేస్తే ఇక్కడి వచ్చి పని చేస్తున్నారా ప్రశ్నించారు. మోదీని రావణుడ్నితో పోల్చారు.

మోదీ కౌంటర్

మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై సరిగ్గా గుజరాత్ తొలివిడత పోలింగ్ రోజున ప్రధాని మోదీ స్పందించారు. మల్లికార్జున ఖర్గేకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.” కాంగ్రెస్‌కు అయోధ్యలో రాముడు ,రామమందిరంపై నమ్మకం లేదు. అది రామసేతును వ్యతిరేకిస్తుంది.కానీ నన్ను దుర్భాషలాడేందుకు రామాయణంలోని రావణుడిని గురించి ఖర్గే ప్రస్తావించారు” అని మోదీ అన్నారు.

గరం గరం

మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై అదేరోజు బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. గుజరాత్‌లో ఓడిపోతున్నారని తెలిసీ ఖర్గే సహనం కోల్పోయారని మండిపడ్డారు. కాంగ్రెస్ పొలిటికల్ డస్ట్ బీన్‌గా తయారైందని, దానికి మల్లికార్జున ఖర్గే డమ్మీ ప్రెసిడెంట్ అని విమర్శించారు.

రెండు విడతల్లో…

గుజరాత్‌లో గురువారం 89 నియోజకవర్గాల్లో తొలివిడత పోలింగ్ జరుగుతోంది. 93 స్థానాల్లో 5న రెండో విడత పోలింగ్ ఉంది. మొత్తం 1,621 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇందులో 339 మంది స్వతంత్ర అభ్యర్థులున్నారు.