Home > Featured > సోఫా వద్దు.. కుర్చీవేయండి.. సోషల్ మీడియాలో మోదీ వీడియో

సోఫా వద్దు.. కుర్చీవేయండి.. సోషల్ మీడియాలో మోదీ వీడియో

ప్రధాని నరేంద్ర మోదీకి ఎక్కడికి వెళ్లిన ఆయన క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రపంచ దేశాధినేతలతో ఆయన తీరు ఎప్పుడూ ప్రశంసనీయంగానే ఉంటుంది. వారితో ఉల్లాసంగా గడుపుతూ దౌత్య సంబంధాలు మెరుగుపరుస్తూ ఉంటారు. తాజాగా మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రష్యా పర్యటనలో ఉన్న ఆయన అక్కడి ప్రతినిధులతో భేటీ సందర్భంగా ఆయన సింప్లీసిటినే ఇందుకు కారణం.

రష్యా ప్రతినిధులతో భేటీ సందర్భంగా అక్కడి అధికారులు ఫోటో సెషన్‌ ఏర్పాటు చేశారు. అక్కడ మోదీ కూర్చునేందుకు కోసం ప్రత్యేకంగా సోఫా ఏర్పాటు చేసి మిగితా వారికి కుర్చీలు వేశారు. తనకు వారు ప్రత్యేక మర్యాదలు చేయడాన్ని అంగీకరించలేదు. అందరితో పాటు తనకు కుర్చీ వేయాలని కోరాడు. వెంటనే నిర్వాహకులు సోఫా తీసేసి కుర్చీ వేశారు. ఈ వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తన ట్విట్టర్ ఖాాతాలో పోస్టు చేశాడు. ఇది వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. విదేశాల్లో భారత గౌరవాన్ని నిలబెట్టారంటూ ఆయన్ను తెగపొగిడేస్తున్నారు.

Updated : 5 Sep 2019 10:18 PM GMT
Tags:    
Next Story
Share it
Top