PM Modi Responds On Pathan Movie Controversy
mictv telugu

సినిమాలపై బీజేపీ శ్రేణులకు ప్రధాని మోదీ చురక

January 18, 2023

PM Modi Responds On Pathan Movie Controversy

బాలీవుడ్ ఖాన్స్ చుట్టూ వివాదాలు సహజం అయిపోతున్నాయి. అమీర్, సల్మాన్, షారుఖ్ సినిమాలని ఎదో రకంగా బ్యాన్ చేయాలన్న డిమాండ్స్ రోజురోజుకి కామన్ అయిపోతున్నాయి. ఎదో ఒక కారణం చెప్తూ.. బీజేపీ దాని అనుబంధ సంస్థలు బాలీవుడ్ లోని కొందరు హీరో హీరోయిన్స్ పై దాడి చేస్తున్నారని ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి. అయితే మొన్న తాజాగా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాపై కూడా పెద్ద ఎత్తున వివాదం నడించింది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే వేసిన బికినీపై బీజేపీ ఫైర్ అయింది. హద్దులు ధాటి గ్లామర్ షో చేయడాన్ని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ పాటలో దీపికా చేసిన గ్లామర్ షో కంటే వంద రెట్లు స్కిన్ షో చేసిన కొందరిపై బీజేపీ ఎప్పుడూ స్పందించలేదని అంటున్నారు.

బీజేపీ తొత్తులుగా పేరున్న అనుపమ్ ఖేర్ ఎన్నో బీ గ్రేడ్ సినిమాల్లో నటించాడు. మోడీ బినామీలకు అమ్ముడుపోయాడన్న బ్రాండ్ ఉన్న అక్షయ్ కుమార్ అయితే మిడ్ నైట్ మసాలా పాటల్లో రెచ్చిపోతాడు. ఇక వచ్చి రాని భాషలో మోడీని నిత్యం జోకుతుందని ప్రచారమున్న కంగనా రనౌత్ విచ్చలవిడిగా ఎన్నో చిత్రాల్లో నటించింది. మరి వీరిపై లేని ఆరోపణలు కొందరిపైనే ఎందుకని బీజేపీపై నెటిజన్స్ నుండి ఎదురుదాడి వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ స్పందించాడు. పఠాన్ లో దీపికా బికినీ, బాలీవుడ్ ఖాన్స్ ని టార్గెట్ చేయటాన్ని ఇన్ డైరెక్ట్ గా తప్పుపట్టారు. బీజేపీ క్యాడర్ అనవసర వివాదాల జోలికి వెళ్లవద్దని నేతలు, కార్యకర్తలకు ప్రధాని మోదీ సలహా ఇచ్చారు. సినిమాల వంటి అనవసర విషయాలపై వివాదాలు సృష్టించడం ద్వారా ప్రభుత్వ, పార్టీ అభివృద్ధి ఎజెండా వెనక్కు వెళ్తుందని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ సినిమా ‘పఠాన్’ను బహిష్కరించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న హిందూ వర్గాలు, బీజేపీ నాయకులని ఉద్దేశించే.. మోదీ ఈ సూచనలు చేశాడని నేషనల్ మీడియాలో ప్రచారం అవుతుంది.