శుక్రవారం ఉదయం తల్లి మరణించి పుట్టెడు దు:ఖంలోనూ ప్రధాని మోదీ తన విధులను నిర్వర్తించారు. మాతృమూర్తి అంత్యక్రియలు జరిగిన కొద్ది గంటలకే అధికార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాధను దిగమింగుకుని ప్రధానిగా కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఈ రోజు జరగాల్సిన నేషనల్ గంగా కౌన్సిల్ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. గంగా నది, దాని ఉపనదుల కాలుష్య నివారణ, పునరుజ్జీవనం, పర్యవేక్షణకు సంబంధించిన విషయాలను కౌన్సిల్లో చర్చించారు.
ఈ సమావేశానికి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులతో పాటు కౌన్సిల్ సభ్యులుగా ఉన్న జలశక్తి మంత్రి, ఇతర కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అంతకుముందు బెంగాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. వ్యక్తిగత కారణాలతో బెంగాల్‌కు రాలేకపోయానన్నారు. ఈ సందర్భంగా మోదీతో మమతా బెనర్జీ మాట్లాడుతూ సానుభూతి ప్రకటించారు. ‘తల్లి మరణం విచారకరం. మీకు తీరని లోటే. మీ అమ్మగారు మాకు అమ్మే. దు:ఖం నుంచి బయటపడేలా ఆ భగవంతుడు మీకు స్థైర్యాన్ని ఇవ్వాలని కోరకుంటున్నా. మోదీజీ దయచేసి కాస్త విశ్రాంతి తీసుకోండి’ అని దీదీ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి :
పీవీ సింధుకు కూడా చంద్రబాబే ఆట నేర్పించా అంటారు : జగన్
నన్ను కోవర్ట్ అన్న కాంగ్రెస్సోడిని చెప్పుతో కొడతా…..ఎమ్మెల్యే జగ్గారెడ్డి విశ్వరూపం