దేశ ప్రజలకు మోదీ మరో సూచన.. ఆదివారం రాత్రి ఇలా చేయాలట - MicTv.in - Telugu News
mictv telugu

దేశ ప్రజలకు మోదీ మరో సూచన.. ఆదివారం రాత్రి ఇలా చేయాలట

April 3, 2020

PM Modi Say Unite in Lighting Lamps  

కరోనాపై పోరులో భారత ప్రజల ఐక్యతను చాటేందుకు ప్రధాని మోదీ మరో అంశంతో ముందుకు వచ్చారు. ప్రజలంతా ఏకతాటిపై ఉన్నామని ప్రపంచ దేశాలకు తెలిసేలా చేయాలని పిలుపునిచ్చారు. దీని కోసం దేశ ప్రజలంతా ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో 9 నిమిషాల సమయాన్ని ప్రతి ఒక్కరూ కేటాయించాలని సూచించారు. ప్రజలంతా ఇళ్లలోని లైట్లు ఆర్పివేసి దీపాలు వెలిగించాలని కోరారు. ఆ సమయంలో ఎవరూ ఇంటి గడప కూడా దాటకూడదని సూచించారు. 

ఇప్పటి వరకూ విజయవంతంగా లాక్‌డౌన్ విజయవంతంగా అమలు చేశామని,మరో 11 రోజుల పాటు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఇండియాలో అమలు అవుతున్న లాక్ డౌన్ ను ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్నదని అందుకే మన ఐక్యతను ఇలా చాటుకోవాలన్నారు. ఇళ్లలోని అన్ని లైట్లనూ ఆర్పివేయాలని, ఆపై వీధుల్లోకి రాకుండా, తలుపుల వద్ద నిలబడి, వీలైనన్ని ఎక్కువ దీపాలను వెలిగించాలని మోదీ కోరారు. సెల్ ఫోన్లలోని ఫ్లాష్ లైట్లను, టార్చి లైట్లను కూడా వెలిగించవచ్చని చెప్పారు. దీని ద్వారా 130 కోట్ల ప్రజల ఆశయం ఒక్కటేనని నిరూపించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.